తెలంగాణ

ఎక్స్‌ప్రెస్ హైవే నివేదికకు కన్సల్టెంట్ నియాకానికి టెండర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: హైదరాబాద్-అమరావతి ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన నివేదిక రూపొందించేందుకు వీలుగా కన్సల్టెంట్ నియామక టెండర్లు పిలిచామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఎక్స్‌ప్రెస్ హైవే జాతీయ రహదారులైన హైదరాబాద్-నాగపూర్, హైదరాబాద్-బెంగళూరు హైవేలకు అనుమతి కోసం పెట్టిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్లు ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత సంవత్సరం కేంద్రం అనుమతించి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థకు బదిలీ చేసిన 5 రాష్ట్ర రహదారుల పనుల భూ సేకరణపై సంబంధిత ఎన్‌హెచ్‌ఎఐ అధికారులతో మంత్రి తుమ్మల సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంబంధిత జిల్లా కలెక్టర్లకు, అధికారులకు, ఇంజనీర్లకు, ఎన్‌హెచ్‌ఎఐ అధికారులకు ఈ రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని, ఒక క్రమ పద్ధతిలో, కాల నియమావళి ప్రకారం ముందుకెళ్ళాలని ఆదేశించారు. త్వరలో ప్రధాన కార్యదర్శి స్థాయిలో జిల్లా కలెక్టర్లతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని, భూ సేకరణకు అత్యంత ప్రాధాన్యత కల్పించి అన్ని రహదారి ప్రాజెక్టులు త్వరగా చేపట్టాలని ఆయన ఆదేశించారు. కేంద్రం ఎపి రీ-ఆర్గనైజేషన్ చట్టం-2014లోని 10వ విభాగంలో సపొందుపరిచిన వౌలిక సదుపాయాల కల్పనలో కేంద్ర సహకారం అందించే ప్రాజెక్టుల అంశంలో భాగంగా ఎక్స్‌ప్రెస్ హైవే జాతీయ రహదారులను త్వరగా రాష్ట్రానికి వచ్చేట్లు తాము కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రం కొత్తగా ఆమోదించిన 2017 నూతన భూ సేకరణ చట్టం 21 ప్రకారం భూ సేకరణ జరపాల్సిందిగా ఎన్‌హెచ్‌ఎఐ సంస్థకు కేంద్రం నుంచి అనుమతులు ఇచ్చే విషయంలో తానూ, రాష్ట్ర పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర ప్రతినిధులు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో చర్చలు జరిపామని మంత్రి తుమ్మల వివరించారు.