తెలంగాణ

బిజెపి, సిపిఎం పోటాపోటీ ర్యాలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: కేరళలో జరుగుతున్న రాజకీయ హత్యలపై బిజెపి, సిపిఎం పార్టీలు సోమవారం హైదరాబాద్‌లో పోటాపోటీ ర్యాలీలకు పూనుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందిరాపార్కు నుంచి బిజెపి శ్రేణులు ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న సిపిఎం రాష్ట్ర కార్యాలయం వైపు ర్యాలీగా బయలుదేరడంతో అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. కేరళలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లే సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలను హతమారుస్తూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ మార్క్సిస్టు పార్టీ కూడా ఆర్‌టిసి క్రాస్ రోడ్‌లోని తన కార్యాలయం నుంచి నారాయణగూడ వైపు ర్యాలీకి పూనుకుంది. ఈ ర్యాలీని కూడా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. బిజెపి ఆందోళనకు బండారు దత్తాత్రేయ, డాక్టర్ కె లక్ష్మణ్ తదితరులు నాయకత్వం వహించారు. కేరళలో సిపిఎం నేతలు చేస్తున్న హత్యా రాజకీయాలను మానుకోవాలని లేనిపక్షంలో రానున్న రోజుల్లో ప్రజలే గుణపాఠం చెబుతారని దత్తాత్రేయ హెచ్చరించారు. ఈ సందర్భంగా బిజెపి నేతలు సిపిఎంకు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేరళ సిఎం దిష్టిబొమ్మను వారు దగ్ధం చేశారు. అనంతరం ఆర్టీసీ క్రాస్‌రోడ్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డిని అరెస్టు చేయకుండా కార్యకర్తలు పోలీసులను ప్రతిఘటించారు. ఈ సందర్భంగా పోలీసులకు కార్యకర్తలకు మధ్య అరగంట పాటు తీవ్ర వాగ్యుద్ధం, తోపులాట జరిగింది. బిజెపి నేతలు దత్తాత్రేయ, రామచంద్రారెడ్డి, రాంచందర్‌రావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర ప్రతిఘటన అనంతరం పోలీసులు కిషన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. బద్దం బాల్ రెడ్డి, కొండ్రు పుష్పలీల, చింత సాంబమూర్తి, వెంకట రమణి, పిఎన్ చారి, పరిమళ్ కుమార్, పద్మారెడ్డి, బండారు రాధిక, గీత తదితరులను అరెస్టు చేసి గాంధీనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
కమ్యూనిస్టులపై దాడి..సూర్యునిపై ఉమ్మేసినట్లే
కమ్యూనిస్టులపై దాడి చేయడం అంటే సూర్యునిపై ఉమ్మేసినట్లేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ, లౌకికతత్వం కోసం నికరంగా నిలబడ్డది, మున్ముందు నిలబడేది ఎర్రజెండానేని అన్నారు. సిపిఎం కార్యాలయాలపై ఆర్‌ఎస్సెస్, బిజెపి దాడులను నిరసిస్తూ సోమవారం నాడిక్కడ ఎంబి భవన్ వద్ద నిర్వహించిన సభలో తమ్మినేని ప్రసంగించారు. దేశంలో మత, కుల ఘర్షణలను సృష్టించి బిజెపి లబ్ధి పొందాలని చూస్తోందని ఈ సందర్భంగా తమ్మినేని అన్నారు. తమను రెచ్చగొడిడే పాతాళంలోకి తొక్కేస్తామని హెచ్చరించారు. అజీజ్ పాషా మాట్లాడుతూ దేశంలో మతోన్మాదం, మత కల్లోలాలు ఉంటేనే బిజెపికి మనుగడ సాధ్యమవుతుందని అన్నారు.
తమ్మినేని, అజీజ్ పాషా అరెస్టు
ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి నారాయణగూడ వైపు వామపక్ష పార్టీలు ర్యాలీకి పూనుకోగా సిపిఐ, సిపిఎం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. తమ్మినేని వీరభద్రం, అజీజ్ పాషాతోపాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. సిపిఎం కార్యాలయం ముట్టడికి బిజెపి పిలుపునివ్వడంతో ఎంబి భవన్ వద్దకు సిపిఎం నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు.