తెలంగాణ

కొత్త జోనల్ వ్యవస్థను శాస్ర్తియ పద్ధతిలో ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: జోనల్ వ్యవస్థను శాస్ర్తియ పద్దతిలో సమగ్రంగా పరిశీలించి నూతనంగా వ్యవస్ధీకరించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం సిఎం కెసిఆర్‌కు విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం నూతన జోన్లను ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు ఉద్యోగుల సంఘం ప్రతినిధులు తెలిపారు. రాష్టప్రతి ఉత్తర్వులు (371డి) సవరణ కోసం, కొత్త జిల్లాలకు అనుగుణంగా జోన్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న అంశంపై ‘స్థానికత’ అమలు నిర్వహణ కోసం ముఖ్యమంత్రి, సీనియర్ అధికారులు, మంత్రులు సుధీర్ఘంగా చర్చించి, ఇందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించడం హర్షణీయని తెలిపారు. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.పద్మాచారి, ఎం.రవీందర్‌కుమార్ తదితరులు ఈ విషయాన్ని ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. జోనల్ వ్యవస్థ పునర్‌వ్యవస్థీకరణ, స్ధానికత నిర్థారణకు యుద్దప్రాతిపదికన నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఈ నిర్ణయం ఎంతో ఉపయుక్తమని పేర్కొన్నారు. నూతన జిల్లాలకు అనుగుణంగా ఉండాలని ప్రభుత్వానికి ఇంతకు పూర్వమే తెలంగాణ ఉద్యోగుల సంఘం కోరుతోందని వారు తెలిపారు.