తెలంగాణ

తెరాస ఎమ్మెల్సీ ఫారుఖ్‌పై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్‌పై కేసు నమోదైంది. రెండేళ్లుగా ఇంటి అద్దె చెల్లించడం లేదని, ఇల్లు ఖాళీ చేయాలనడంతో తనను దుర్భాషలాడుతూ, చెప్పు తీసి తనపై దాడికి యత్నించాడని ఓ మహిళ (ఎన్నారై) నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రెడ్‌హిల్స్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఎమ్మెల్సీ ఆరేళ్లుగా నివాసముంటున్నాడని, రెండేళ్లుగా అద్దె ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని బాధితురాలు హంతుల్ వాసే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తాను న్యూయార్క్ (అమెరికా) నుంచి వారం రోజుల క్రితం హైదరాబాద్ వచ్చానని, తన నివాసంలో ఉంటున్న ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్‌ను అద్దె అడిగినందుకు తనపై చెప్పుతో దాడి చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తనను దుర్భాషలాడి, చెప్పుతో దాడికి పాల్పడిన ఎమ్మెల్సీపై తగు చర్యలు తీసుకుని తన ఇంటిని తనకు అప్పగించాలని ఆమె పోలీసులను కోరింది. ఈ మేరకు పోలీసులు ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్‌పై ఐపిసి 504,509,569 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఇన్స్‌పెక్టర్ తెలిపారు.
అప్రతిష్టపాలు చేసేందుకే కుట్ర: ఎమ్మెల్సీ
ఎన్నారైకి చెంది ఇంటి అద్దె విషయంలో రాజుకున్న వివాదంపై ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ స్పందించారు. తన ఇంటికి ఓ మహిళతోపాటు మరో వ్యక్తి వచ్చి ఇంటిని ఖాళీ చేయాలని కోరారని, ఆమె ఇంటి యజమాని అనే విషయం తనకు తెలియదని ఫారుఖ్ హుస్సేన్ వివరించారు. కాగా ఆ మహిళ తనను తిట్టడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని చెప్పానన్నారు. తన రాజకీయ జీవితంలో అవినీతికి పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. లక్డికాపూల్‌లో కొనే్నళ్లుగా అద్దెకు ఉంటున్నానని, సోమవారం ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇల్లు ఖాళీ చేయాలని తమ ఇంటికి వచ్చారన్నారు. ఎమ్మెల్యేల క్వార్టర్స్ పూర్తయ్యాక వెళ్తానని వారితో చెప్పినట్టు ఆయన మీడియాకు తెలిపారు. పథకం ప్రకారం తనను బద్‌నాం చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి తాను న్యాయపరంగా నడుచుకుంటానన్నారు.

చిత్రాలు..ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ *అంతుల్ వాసే