తెలంగాణ

పరిశ్రమల కాలుష్యంపై కమిటీ వేసి నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: మేడ్చెల్ జిల్లా దూలపల్లి పరిశ్రమల వల్ల కాలుష్యం పెరిగిందనే విషయమై కమిటీని నియమించి అంచనా వేయాలని హైకోర్టు మేడ్చెల్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ విషయమై జి సతీష్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ జి గంగారావు విచారించారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున న్యాయవాది ఎస్ సత్యం రెడ్డి వాదనలు వినిపిస్తూ ఐడిఏ దూలపల్లి ప్రాంతంలో అనుమతులు లేకుండా అనేక గోదాములు నిర్మించారని, రసాయన యూనిట్లను నెలకొల్పారని కోర్టుకు తెలిపారు.
కెమికల్ యనిట్ల తరఫున న్యాయవాది ఎస్ శ్రీరాం వాదనలు వినిపించారు. తమకు చట్టప్రకారం అనుమతులున్నా, అధికారులు అక్రమంగా యూనిట్లను మూసివేయిస్తున్నారన్నారు. మూసివేసిన యూనిట్లను తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టుకు అభ్యర్థించారు.
కాప్రా చెరువును నోటిఫై చేశారా
రంగారెడ్డి జిల్లా కాప్రా చెరువును వాట్టా చట్టం సెక్షన్ 23 కింద నోటిఫై చేశారా లేదా అనే అంశాన్ని తెలియచేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాప్రా చెరువును పరిరక్షించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని లేక్‌వ్యూ రెసిడెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. కాలుష్య నియంత్రణ మండలి ఈ అంశంపై నివేదిక ఇచ్చింది.
అనంతరం కోర్టు జోక్యం చేసుకుని కాప్రా చెరువును నోటిఫై చేశారా లేదా అనే అంశంపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.