తెలంగాణ

విద్యుత్ సరఫరాపై రైల్వే ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆరు డివిజన్లలో విద్యుత్ సరఫరాకు ఎనర్జి ఎఫిషియన్స్ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్)తో మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాదికి 9.8 లక్షల యూనిట్ల విద్యుత్ సరఫరాకు ఒప్పందం కుదిరింది. రైళ్లలో సీలింగ్ ఫ్యాన్లు, ఇన్‌వర్టర్లు, లైట్లు, ఎయిర్ కండిషన్స్ వంటి వాటికి గానూ, దక్షిణ మధ్య రైల్వే ఏటా రూ. 88 లక్షలు చెల్లించేందుకు వీలుగా ఈ ఒప్పందం కుదిరింది. ఇలా ఉండగా, ప్రయాణికుల సౌకర్యార్థం నవంబర్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చే తిరుపతి-నిజామాబాద్ రాయలసీమ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లపై దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఓ ప్రకటన చేసింది.
ట్రైన్ నెం. 12793/12794 రాయలసీమ ఎక్స్‌ప్రెస్ 2ఏసి 2టయర్, 2 ఏసి 3టయర్, 7 స్లీపర్ క్లాస్, 5 జనరల్ సెకండ్ క్లాస్‌తోపాటు 2 లగేజ్, జనరేటర్ కోచ్‌లుంటాయని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఉమాశంకర్ కుమార్ తెలిపారు.