తెలంగాణ

ఓయులో ఎసి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: ఉస్మానియా యూనివర్శిటీలో ఎయిర్ కండిషనింగ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా పరిశ్రమకు, విద్యాసంస్థలకు మధ్య ఉన్న అగాధం తొలగి పూర్తి శిక్షణ, కౌశలాలు పొందిన విద్యార్థులను రూపొందించేందుకు వీలుకలిగిందని వర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామచంద్రం పేర్కొన్నారు. డైకిన్ సంస్థ ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎస్ గోపాల్‌రెడ్డి, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం హెడ్ ప్రొఫెసర్ ఉషశ్రీ, డైకిన్ ఎండి కన్వల్ జీత్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయేష్ దేశ్‌పాండే, జిఎం ఎపిఎస్ గాంధీ, ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సమీనా ఫాతిమా పాల్గొన్నారు.