తెలంగాణ

పరిశ్రమలు, పార్టీ అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి, మరోవైపు పార్టీ కోసం అంకితమైన భావంతో పని చేస్తానని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, వౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టిఎస్-ఐఐసి) చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. టిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన బాలమల్లును మంగళవారం పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు. ఈ సందర్భంగా బాలమల్లు మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పార్టీలో కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవిలో నియమించారని తెలిపారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయబోనని ఆయన అన్నారు. పార్టీ అధినాయకత్వం అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఆయన తెలిపారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి పార్టీ అధికారంలోకి తీసుకుని రావడమే లక్ష్యంగా శ్రమిస్తానని చైర్మన్ బాలమల్లు చెప్పారు.