తెలంగాణ

క్రీమిలేయర్ మెమో గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: బిసి క్రిమిలేయర్‌పై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో గందరగోళంగా ఉందని, దీనిని వెంటనే సవరించాలని రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్‌ను కలిసి మంగళవారం వినతి పత్రం సమర్పించినట్టు బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులలో బిసి క్రిమిలేయర్ పరిమితిని ఆరు లక్షల రూపాయాలుగా పేర్కొన్నారని, ఈ పరిమితిని ఇటీవల కేంద్ర ప్రభుత్వం 8 లక్షల రూపాయాలకు పెంచిందని జాజుల గుర్తు చేసారు. తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ జారీ చేస్తున్న ఉద్యోగ నియామకాలకు హాజరయ్యే అభ్యర్థులు బిసి క్రిమిలేయర్ ప్రకారం ధ్రువపత్రాన్ని సమర్పించాల్సి ఉండటంతో వెంటనే జారీ చేసిన ఉత్తర్వులను సవరించాలని కోరారు. అలాగే మహిళా అభ్యర్థులు తప్పని సరిగ్గా తండ్రి పేరిట ఉన్న బిసి క్రిమిలేయర్ ధ్రువపత్రాన్ని సమర్పించాలని నిబంధన పెట్టారని, వివాహం అయిన మహిళలకు భర్త పేరుతో ఉన్న ధ్రువపత్రాన్ని సమర్పించే వెసులుబాటు కల్పించాలని జాజుల విజ్ఞప్తి చేసారు. తాజా మార్గదర్శకాలతో బిసి క్రిమిలేయర్‌పై ఆదేశాలు జారీ చేయాలని శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేసారు.