తెలంగాణ

నవజాత శిశు సంరక్షణలో తెలంగాణది రెండోస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: నవజాత శిశువుల సంరక్షణలో తెలంగాణ జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం జాతీయ శిశు ఆరోగ్య సమీక్ష సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించింది. మొదటిస్థానంలో హరియాణ నిలిచింది. సిఎం కెసిఆర్ దార్శనికత వల్లనే వైద్య ఆరోగ్య శాఖకు జాతీయ స్థాయిలో అవార్డులు లభిస్తున్నాయని, వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత మాతా శిశు సంరక్షణపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నామన్నారు. ఇన్‌ఫెంట్ మోర్టాలిటీ రేట్‌ను 39 నుండి 31 కి తగ్గించామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21 నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు (ఎస్‌ఎన్‌సియు) ఉన్నాయని, మరో ఏడు కేంద్రాలను త్వరలో ప్రారంభిస్తామన్నారు. గత ఏడాది 21 నవజాత శిశు సంరక్షణ కేంద్రాల్లో 29 వేల మంది శిశువులను చేర్చుకుని సంరక్షించామన్నారు.