తెలంగాణ

కొనసాగుతున్న లారీల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: తెలంగాణవ్యాప్తంగా లారీల సమ్మె కొనసాగుతోంది. మంగళవారం రాష్టవ్య్రాప్తంగా దాదాపు ఐదు వేల లారీలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ, ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ సంక్షోభంలో ఉందని, పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పెట్రో ఉత్పత్తుల ధరలు హెచ్చు, తగ్గులు లేకుండా చూడాలన్నారు. ఇదిలావుండగా కొత్తపేట, మెదీపట్నం, బేగంబజార్ మార్కెట్‌లలో లారీల సమ్మె ప్రభావం చూపింది. నిత్యావసర వస్తువులు నిలిచిపోవడంతో హోల్‌సేల్ వ్యాపారులు తమ స్టాక్‌ను గోడౌన్లకు తరలించారు. చిల్లర వర్తకులు మాత్రం ప్రతి వస్తువులపై కొంత మేరకు ధరలు పెంచారు. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబీకులు బెంబేలెత్తుతున్నారు.