తెలంగాణ

వయోవృద్ధులకు డే-కేర్ సెంటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: మున్సిపాలిటీలో వయోవృద్ధులకు డేకేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని స్ర్తిశిశు సంక్షేమ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. వయోవృద్ధుల సంక్షేమంపై సీనియర్ సిటిజన్ స్టేట్ కౌన్సిల్ తొలి సమావేశం మంగళవారం సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, వయోవృద్ధుల చట్టంపై ప్రతి ప్రభుత్వ అధికారికి అవగాహన ఉండేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో చికిత్సకోసం వయోవృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. వృద్ధాశ్రమాల్లో వైద్య సేవలు అందించేందుకు మొబైల్ వ్యాన్లద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వైద్య శాఖ ఉన్నతాధికారులకు సూచించారు.
ఆర్టీసి బస్‌పాస్‌లలో సీనియర్ సిటిజన్లకు తగ్గింపు ఇవ్వాలని ఆదేశించారు. వయోవృద్ధుల అవసరాలకోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆరోగ్య సమస్యలపై సూచనలు ఇచ్చేందుకు ఈ హెల్ప్‌లైన్లు ఉపయోగపడేలా చూడాలన్నారు. పోలీస్ స్టేషన్లకు ఎవరైనా వయోవృద్ధులు సమస్యలను పరిష్కరించాలని వస్తే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 32.69 లక్షల మంది వయోవృద్ధులు ఉన్నారని, వీరిలో 13.39 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో రెండు వయోవృద్ధ ఆశ్రమాలు, ప్రభుత్వ సహకారంతో 17 ఎన్‌జిఓలు నడిపిస్తున్న వృద్ధాశ్రమాలున్నాయన్నారు.
వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేసేందుకు ఎన్‌జిఓలు ముందుకు వస్తే ప్రభుత్వం సహకరిస్తుందని వివరించారు. ఈ సమావేశంలో వయోవృద్ధుల సంక్షేమ కార్యదర్శి జగదీశ్వర్‌తో పాటు పోలీసు, రవాణా, మున్సిపాలిటీ, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..మంగళవారం సచివాలయంలో వయోవృద్ధుల సంక్షేమంపై సీనియర్ సిటిజన్
స్టేట్ కౌన్సిల్ తొలి సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు