తెలంగాణ

పురిటి గడ్డ రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్ని జన్మలెత్తినా.. సిద్దిపేట నాకు శక్తిపీఠం
ఏపీ, బెంగాల్‌తప్ప అన్ని రాష్ట్రాల్లో కొత్త జిల్లాలు విపక్షాల పన్నాగాలను తిప్పికొడుతున్న హరీశ్
ఈశాన్యంలో రంగనాయక్‌సాగర్ మనకు వరం
ప్రపంచంలోనే వ్యవసాయంలో మనం అగ్రగ్రామి రైతులను సంఘటితం చేయడమే నా ధ్యేయం చివరి క్షణంవరకు సిద్దిపేట అభివృద్ధికి కృషి
వ్యాపార, వాణిజ్య రంగాల్లో తెలంగాణ టాప్ సిద్దిపేట బహిరంగ సభలో సిఎం కెసిఆర్ సమీకృత భవన సముదాయానికి శంఖుస్థాపన

ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, అక్టోబర్ 11: జన్మనిచ్చింది. రాజకీయ పాఠాలు నేర్పింది. అనర్గళంగా మాట్లాడే భాషా పటిమ కల్పించింది. మరుగున పడిన ఉద్యమానికి పిడికిలి బిగించి లేవనెత్తే శక్తినిచ్చింది. అలాంటి పురిటి గడ్డ సిద్దిపేట రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను అని రాష్ట్ర సిఎం కె చంద్రశేఖర్‌రావు భావోద్వేగంతో పేర్కొన్నారు. దేశంలోని 18 శక్తిపీఠాల బలమెం తో సిద్దిపేట తనకు అంతే శక్తినిస్తోందని హర్ష ధ్వానాల మధ్య ప్రకటించారు. తెలంగాణ సాధనతో జన్మ ధన్యమైందన్నారు. కొత్త జిల్లా లు ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా సిద్దిపేటలో బుధవారం మధ్యాహ్నం దుద్ద్దెడ గ్రామ శివారులో సమీకృత కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ భవనాలు, ఎన్సాన్‌పల్లి శివారులో మెడికల్ కళాశాల భవన నిర్మాణాలకు కెసిఆర్ శంకుస్థాపన చేశారు. ఆనంతరం సిద్దిపేట బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉత్తేజపరిచే రీతీలో ప్రసంగించారు. తెలంగాణ ఏర్పడక ముందు దేశంలో ఏపీ, పశ్చిమ బెంగాల్ వినా అన్ని రాష్ట్రాలూ పరిపాలన సౌలభ్యం కొరకు సంస్కరణలు చేపట్టి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాయన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు తాను ఆనాటి సిఎం ఎన్టీఆర్‌కు సిద్దిపేటలో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా వినతి పత్రం అందజేశానని, హామీలిచ్చినా అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేసారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా కొత్త జిల్లాల ఏర్పాటులో వివక్ష చూపించారని ధ్వజమెత్తారు. తెలంగాణ సాధించగానే 10 జిల్లాలున్న రాష్ట్రాన్ని 31 జిల్లాలుగా విభజన చేసి పరిపాలన సౌలభ్యం కల్పించామన్నారు. గత ఏడాది దసరా రోజున కొత్త జిల్లాలను సిద్దిపేట నుంచి ప్రారంభించానని, సరిగ్గా యేడాదికి రూ.1300 కోట్లతో కొత్త కలెక్టరేట్ భవనాలు, జిల్లా ఎస్పీ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపనలకు శ్రీకారం చుట్టామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి మొదటి స్థానానికి తీసుకువచ్చిన ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కిందన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రాజెక్టుల నిర్మాణాలకు శ్రీకారం చుడితే ప్రతిపక్షాలు పన్నుతున్న కుట్రలను మంత్రి హరీశ్‌రావు సమర్థవంతంగా తిప్పికొడుతున్నారని అభినందించారు. సిద్దిపేటకు ఈశాన్య ప్రాంతాన రంగనాయక్‌సాగర్ ఉండడం వరమన్నారు. ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, అందుకు ఎన్ని నిధులైనా కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. సారవంతమైన భూముల్లో పండుతున్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలంటే రైతులు సంఘటితం కావాలని, అందుకే రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఒకే రకమైన పంటలను సాగు చేయకుండా లాభసాటి సాగు దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నామని స్పష్టం చేసారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా రైతు సమన్వయ కమిటీలు లేవని, ఒక్క తెలంగాణలోనే సాధ్యమైందన్నారు. రైతుల అభివృద్ధికి తోడ్పాటునివ్వకుండా ప్రతిపక్షాలు అవహేళన చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు పంటలకు ఎకరాకు 8 వేల రూపాయల చొప్పున రైతులకు ఆర్థిక తోడ్పాటునిస్తూ నేరుగా ఖాతాల్లో జమచేస్తామని పునరుద్ఘాటించారు. కేంద్ర మంత్రి స్థాయికి చేర్చిన సిద్దిపేటకు ఎన్ని సేవలందించినా తక్కువేనని, చివరి క్షణం వరకు జన్మభూమి అభివృద్ధికి పాటుపడతానని సిఎం కెసిఆర్ ప్రతిజ్ఞ చేశారు. బహిరంగ సభలో మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్‌పి సింగ్, డిజిపి అనురాగ్ శర్మ, ఎంపిలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాటి కరుణ, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, బాలకిషన్, సతీష్‌కుమార్, మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్, సుధాకర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, రాములు నాయక్, వెంకటేశ్వర్లు, రాష్ట్ర స్థాయికి చెందిన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.