తెలంగాణ

భారీగా పెరిగిన భూగర్భజలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12 : తెలంగాణ జిల్లాల్లో తాజాసమాచారం ప్రకారం భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. 2017 మే నెలతో పోలిస్తే, సెప్టెంబర్ చివరికి భూగర్భజలాలు బాగా పెరిగాయని భూగర్భజలశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నైరుతీ రుతుపవనాల మూలంగా నాలుగు జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైందని, 19 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని వెల్లడించారు. మరో ఎనిమిది జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ చివరి వరకు 724 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావలసి ఉండగా, 647 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
తాజా సమాచారం ప్రకారం భూగర్భానికి 0.32 మీటర్ల వద్ద కొన్ని చోట్ల జలాలు ఉండగా, మరికొన్ని చోట్ల 37.47 మీటర్ల లోతులో ఉన్నాయని భూగర్భజలశాఖ వివరించింది. భూఉపరితలంలో జలాలు ఉన్నప్రాంతం కామారెడ్డి జిల్లాలోని ఎర్రపహాడ్ గ్రామం కాగా, అత్యధిక లోతైన ప్రాంతంలో భూగర్భజలాలు ఉన్న గ్రామం సిద్ధిపేట జిల్లాలోని దౌల్తాబాద్ మండలం ముబారస్‌పూర్‌లో రికార్డయింది. 41 మండలాల్లో భూగర్భజలాలలు 20 మీటర్లు అంతకన్నా లోతులో ఉన్నాయి. సిద్ధిపేట జిల్లాలో ఏడు మండలాలు, మెదక్ జిల్లాలో ఆరు మండలాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదు మండలాలు, రంగారెడ్డి జిల్లాలో ఐదు మండలాలు, సంగారెడ్డి జిల్లాలో నాలుగు మండలాల్లో ఈ పరిస్థితి నెలకొని ఉంది. 208 మండలాల్లో భూగర్భజలాలు 10 మీటర్ల నుండి 20 మీటర్ల మధ్యలో ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 20 మండలాలు, రంగారెడ్డి జిల్లాలో 16, నిజామాబాద్ జిల్లాలో 16, నల్లగొండ జిల్లాలో 14 మండలాల్లో ఈ పరిస్థితి ఉంది. 167 మండలాల్లో భూగర్భ జలాలు 5 మీటర్ల నుండి 10 మీటర్ల మధ్యలో ఉన్నాయి. అంటే భూమిపైభాగానే్న నీళ్లు ఉన్నాయి. ఈ పరిస్థితి ఉన్న ప్రాంతాల్లో నల్లగొండ జిల్లాలో 12 మండలాలు, సూర్యాపేట జిల్లాలో 10 మండలాలు, భద్రాద్రి జిల్లాలో 9 మండలాలు, ఆదిలాబాద్ జిల్లాలో 9 మండలాల్లో ఈ పరిస్థితి ఉంది.
కేవలం రెండుమీటర్ల లోతులో ఉన్న మండలాలు 49 ఉన్నాయని భూగర్భజలశాఖ వెల్లడించింది. యాదాద్రి జిల్లాలో భూమిపైగానే జలాలు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఎనిమిది జిల్లాల్లో భూగర్భజలాలు పెరగగా, 23 జిల్లాల్లో తగ్గిపోయాయని వివరించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలను నిలువ చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ శాఖ ప్రభుత్వానికి సూచించింది. నీటి సంరక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించింది. వర్షపునీరు వీలైనంత వరకు భూమిలోకి ఇంకిపోయేలా చూడాలని సూచించింది.