తెలంగాణ

14వ ఆర్థిక సంఘం నుంచి రూ.5375 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: రాష్ట్రానికి 14వ ఆర్థిక సంఘం ద్వారా ఐదు సంవత్సరాల వ్యవధికి రూ. 5375 కోట్ల గ్రాంట్ వస్తుందని ప్రభుత్వం అంచన వేసింది. ఇప్పటికే 2015-16 ఆర్థిక సంవత్సరం వరకు రూ.1953 కోట్ల నిధులు విడుదల కాగా రూ.1441 కోట్లు పెట్టినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ పేర్కొన్నారు. సచివాలయంలో గురువారం 14వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి అందిన నిధుల వ్యయం, పనులను సిఎస్ సమీక్షించారు. ఈ గ్రాంట్ కింద వచ్చిన నిధులతో గ్రామాలలో పారిశుధ్యం, స్మశాన వాటికల నిర్మాణం, సాలీడ్ వేస్ట్ మెనేజ్‌మెంట్, ఎల్‌ఇడి లైటింగ్ తదితర కార్యక్రమాలకు ఖర్చు చేయాలని సంబంధిత అధికారులకు సిఎస్ సూచించారు. 14వ ఆర్థిక సంఘం నిధుల వ్యయానికి నియమ నిబంధనలను రూపొందించాలని సిఎస్ ఆదేశించారు. ఈ నిధుల నుంచి సోలార్ లైటింగ్, హరితహారానికి నిధులు కేటాయించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామాలలో పన్నుల వసూలు, నిధుల వినియోగంపై ఎప్పటికప్పుటు సమీక్షించాలని సిఎస్ ఆదేశించారు.