తెలంగాణ

2019కి అన్ని పంచాయతీల్లో ఎల్‌ఈడి వీధి దీపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో 2019 మార్చి 31 నాటికి ఎల్‌ఈడి వీధి దీపాలను ఏర్పాటు చేస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఎల్‌ఈడి వీధి దీపాలను పంచాయతీ నిధులతో ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. శుక్రవారం నాడిక్కడ రాజేంద్రనగర్‌లోని టిసిపార్డ్‌లో జరిగిన సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులతో పంచాయతీల్లో ఎల్‌ఈడి వీధి దీపాల ఏర్పాటుపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షించారు. కేంద్రప్రభుత్వ రంగసంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ లిమిటెడ్ కూడా వీధిపాల ఖర్చు భరిస్తుందని తెలిపారు. దీనితో పంచాయతీలు 10 సంవత్సరాల వరకు అగ్రిమెంట్ చేసుకోవచ్చని తెలిపారు. వీధి దీపాలను బిగించడం, నిర్వహణ అంతా ఆ సంస్థ చూసుకుంటుందని, విద్యుత్ ఆదా ద్వారా మిగిలే మొత్తంలో 80 శాతాన్ని నిర్వహణ ఖర్చుల కింద ఆ సంస్థకు పంచాయతీలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఎల్‌ఈడి వీధి దీపాలు కావాలను అనుకుంటే పంచాయతీ తీర్మానం చేసి పంపిస్తే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ లిమిటెడ్ లైట్లు బిగిస్తుందని తెలిపారు. పురపాలక సంఘాల్లో ఇప్పటికే వీధి దీపాలుగా ఎల్‌ఈడి బల్పులు అమర్చామని, ఇక నుంచి గ్రామాల్లో కూడా ఎల్‌ఈడి వెలుగులకు పైలెట్ ప్రాజెక్టుతో అంకురార్పణ చేస్తున్నామని మంత్రి చెప్పారు.