తెలంగాణ

కోటి మంది కెసిఆర్‌లు అడ్డుపడినా ప్రజల పక్షానే పోరాడుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: కోటి మంది కెసిఆర్‌లు అడ్డుపడినా తాము ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామని టి.పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. లక్ష మంది ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు వచ్చినా ప్రాజెక్టులు కట్టి తీరుతామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సూర్యాపేట సభలో చేసిన వ్యాఖ్యలపై మల్లు రవి శుక్రవారం విలేఖరుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే తాము అధికారంలో ఉన్నప్పుడు లక్ష కోట్ల రూపాయల ప్రతిపాదనలతో 30 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని, అవి 80 నుంచి 90 శాతం వరకు పూర్తయ్యాయని అన్నారు. అయితే వాటికి రీ-డిజైన్ పేరిట కోట్లాది రూపాయలు కమిషన్లు దండుకుంటున్నారని ఆయన విమర్శించారు.
అజహరుద్దీన్‌కు సద్భావన అవార్డు
చారిత్రాత్మకమైన చార్మినార్ వద్ద ఈ నెల 19న రాజీవ్ గాంధీ సద్భావన దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక దినోత్సవ కమిటీ చైర్మన్ జి. నిరంజన్ తెలిపారు. ఈ సందర్భంగా భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్‌కు, విశ్రాంత ఐఎఎస్ అధికారి ఎం. గోపాల కృష్ణకు సద్భావన అవార్డులు అందజేయనున్నట్లు ఆయన చెప్పారు.