తెలంగాణ

నకిలీ విత్తన కంపెనీలపై చర్యలేవి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: రైతుల పాలిట శాపంగా మారిన నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్న కంపెనీలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టిటిడిపి నేతలు వ్యవసాయ శాఖ కమిషనర్‌ను ప్రశ్నించారు. నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు కూడా పరిహారం ఎందుకు చెల్లించడం లేదో తెలియజేయాలని అన్నారు. టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, నేతలు ఎస్ వెంకట వీరయ్య, ఉమామాధవరెడ్డి, ఈ.పెద్దిరెడ్డి. బోడ జనార్థన్, కొత్తకోట దయాకర్‌రెడ్డి, సీతక్క, వేం నరేందర్‌రెడ్డి, సీత దయాకర్‌రెడ్డి శుక్రవారం వ్యవసాయ శాఖ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 2015లో మహబూబ్‌నగర్ జిల్లాలో నకిలీ విత్తనాల కారణంగా నష్టపోయిన పంటలపై ప్రభుత్వం జివో జారీ చేసి అదికారిక కమిటీని నియమించి విచారణ జరిపించిందని గుర్తు చేశారు. ఆ కమిటీ విచారణ జరిపి కావేరి, అంకూర్, నూజివీడు, జెకే, రాశి, శ్రీరామ్ తదితర పేర్లతో నకిలీ విత్తనాలను విక్రయించిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఆ కమిటీ నివేదికను సమర్పించినా ఇంతవరకు నివేదికను అమలు చేయలేదని అన్నారు. రైతులు పెట్టుబడి పెట్టిన మొత్తంలో60 శాతం మొత్తాన్ని ఆయా కంపెనీలు చెల్లించాలని సిఫార్సు చేసినా అతీగతి లేదని వారు ఆ లేఖలో వ్యవసాయ కమిషనర్ దృష్టికి తెచ్చారు.
ప్రతి ఏటా నకలీ విత్తనాల బెడద తప్పడం లేదని అన్నారు. రైతులు నష్టపోతూనే ఉన్నారని తెలిపారు. పత్తికి గిట్టుబాటు ధరను కల్పించడంలో సిసిఐ విఫలవౌతోందని అన్నారు. దేశంలో ఇతర ప్రాంతాల్లో పత్తి పంటకు కనిష్టంగా రూ.4,600 వరకు ధర వస్తుండగా తెలంగాణలో రూ.2500 మించడం లేదని తెలిపారు. ఈ నేపధ్యంలో ప్రస్తుతం నకిలీ విత్తనాల కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించడానికి అధికారిక కమిటీని నియమించాలని, నాసిరకం, నకిలీ విత్తనాల కారణంగా దెబ్బతిన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు ఎకరానిక రూ.40 వేల పరిహారాన్ని చెల్లించాలని వారు కోరారు.