తెలంగాణ

రైల్వే పనులు వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 13: మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని రైల్వేలైన్‌కు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని కోరుతూ శుక్రవారం మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యుడు, తెరాస ఫ్లోర్ లీడర్ ఎంపి జితేందర్‌రెడ్డి సారథ్యంలో దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్‌యాదవ్‌తో మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, రాంమోహన్‌రెడ్డిలు భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు అంశాలను మంత్రి, ఎంపి, ఎమ్మెల్యేలు జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా ఎంపి జితేందర్‌రెడ్డి సమావేశంలో ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వం శంషాబాద్ నుండి మహబూబ్‌నగర్ వరకు డబ్లింగ్ రైల్వేలైన్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించిందని దాదాపు రూ.2వేల కోట్లకుపైగా నిధులను డబుల్ రైల్వేలైన్ మార్గానికి కేటాయించిందన్నారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే అధికారులను కోరారు. ఇందుకు స్పందించిన రైల్వే అధికారులు ఇప్పటికే డబ్లింగ్ లైన్‌కు సంబంధించి ప్రణాళికలు రూపొందించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని పనులు కూడా ప్రారంభించామన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున కొంత ఆలస్యం అవుతుందని వెల్లడించారు. మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్‌లో వౌలిక వసతులు కల్పించాలని గద్వాల, మాచార్ల లైన్ కూడా మంజూరు చేసి వచ్చే బడ్జెట్‌లో కేటాయించాలన్నారు. వికారాబాద్- కృష్ణా రైల్వేలైన్‌కు ప్రణాళికలు రూపొందించి కేంద్రానికి పంపించాలని కేంద్రమంత్రితో తాను ప్రత్యేకంగా మాట్లాడుతానని అందుకు అధికారులు పూర్తి సహకారం ఇవ్వాలని కోరారు.
మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని పనులను పూర్తి చేయాలని జిఎంను ప్రత్యేకంగా ఎంపి జితేందర్‌రెడ్డి కోరారు. డబ్లింగ్ లైన్ వచ్చే ఏడాది 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేయాల్సి ఉందని వెల్లడించారు. ఆ దిశగా దక్షిణమధ్య రైల్వే అధికారులు పనులు వేగవంతం చేయాలని కోరారు. మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జడ్చర్లలో రోడ్‌అండ్‌బ్రిడ్జి పనులను చేపట్టాలని, ముదిరెడ్డిపల్లి దగ్గర కూడా చేపట్టాలన్నారు. చేటన్‌పల్లి దగ్గర కూడా ఈ బ్రిడ్జిని నిర్మించాల్సి ఉందని కోరారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రైల్వేస్టేషన్‌లో నూతనంగా మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు సద్దలగుండు దగ్గర 40 ఫీట్లరోడ్డు రైల్వేపరిధిలో నిర్మించాలని కోరారు. అప్పన్నపల్లి దగ్గర కొత్త రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ దేవరకద్రలో రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని మదనపూర్, దేవరకద్రలో అన్ని రైళ్లు నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జక్లేర్ నుండి కృష్ణ వరకు రైల్వే పనులు చేపట్టాలని మక్తల్ ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి కోరారు. అయితే దక్షిణమధ్య రైల్వే జిఎం వినోద్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ అన్ని పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని కొన్ని పనులు కొంత ఆలస్యం కావచ్చుకానీ అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్నారు. ఎంపి జితేందర్‌రెడ్డి కల్పించుకుని శంషాబాద్‌కు లోకల్‌రైళ్లు నడుస్తున్నాయని వాటిని షాద్‌నగర్ వరకు పొడిగించాలని ఎంపి జితేందర్‌రెడ్డి అధికారులను కోరారు. ఇందుకువారు పనులు పూర్తి అయిన వెంబడే తప్పకుండా లోకల్‌రైళ్లు నడిచేలా చర్యలు తీసుకుంటామన్నారు.

చిత్రం..దక్షిణమధ్య రైల్వే అధికారులతో భేటీ అయి పనులపై సమీక్షిస్తున్న మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపి జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు