తెలంగాణ

పగలు 6 గంటలు, రాత్రి 3 గంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఇక నుంచి పగలు 6 గంటలు, రాత్రి 3 గంటల విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించినట్టు విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ సదరన్ పవర్ డిస్కమ్ కార్యాలయంలో మంగళవారం ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తుండగా, నిరంతరంగా ఒకేసారి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేయకుండా పగలు, రాత్రి రెండు పూటలా విద్యుత్ సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారని మంత్రి అన్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేయడానికి రాత్రి, పగలు తేడా లేకుండా అధికారులు కష్టపడి పని చేస్తున్నారని మంత్రి అభినందించారు. మార్చి చివరి నాటికి 6700 మెగావాట్ల విద్యుత్‌కు డిమాండ్ ఉండగా, ఈ నెలలో ఇది 7200 మెగావాట్ల డిమాండ్‌కు చేరుకుందన్నారు. వర్షాలు బాగా కురిస్తే ఈ డిమాండ్ 9000 మెగావాట్లకు చేరుకుంటుందని అంచన వేస్తున్నట్టు మంత్రి వివరించారు. వర్షాకాలంలో విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్టుగా ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను పటిష్టపరిచినట్టు మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. విద్యుత్ లోడ్ పెరగడం వల్లనే విద్యుత్ సరఫరాలో అంతరాయానికి కారణమన్నారు. దీంట్లో సిబ్బంది నిర్లక్ష్యం లేదని మంత్రి స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే విషయాన్ని ప్రజలకు ముందుగా తెలియజేయాలని మంత్రి సూచించారు.
ప్రజలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం కోసం స్థాపిత సామర్థ్యంకు మించి అవసరమైన విద్యుత్ స్వల్పకాలిక టెండర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నామన్నారు. వాడకం డిమాండ్ తగ్గినప్పుడు ప్రైవేట్ సంస్థలు 15 శాతం విద్యుత్ ఉత్పత్తిని తగ్గించుకొని, మిగతాది జెన్‌కో తగ్గించుకుంటుదన్నారు. ప్రజలకు ఎక్కడా నష్టం కలిగే చర్యలు తీసుకోవడం లేదని, చాలా రాష్ట్రాల కంటే పిఎల్‌ఎఫ్ రాష్ట్రంలో తక్కువగా ఉందని మంత్రి గుర్తు చేశారు.

ముస్లిం రిజర్వేషన్లపై
షబ్బీర్ ‘పవర్ పాయింట్’
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 19: ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేత, శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ మంగళవారం ‘పవర్ పాయింట్ ప్రజెంటేషన్’ ఇచ్చారు. గాంధీభవన్ ఆవరణలోని ఎపిసిసి కార్యాలయమైన ఇందిరాభవన్ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ ముస్లిం రిజర్వేషన్లపై రూపొందించిన వెబ్‌సైట్‌ను టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రారంభించారు. సిడిలను సిఎల్‌పి నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి విడుదల చేశారు. ఆ తర్వాత షబ్బీర్ అలీ సుమారు 45 నిమిషాల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారని, అయితే మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని కోర్టు చెప్పడంతో ఆ రిజర్వేషన్లను 4 శాతానికి కుదించి, పకడ్బందిగా అమలు చేయడం జరిగిందన్నారు. ఫలితంగా వేల సంఖ్యలో ముస్లిం యువత డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారని, ఉద్యోగాల్లో స్థిరపడ్డారని ఆయన తెలిపారు. అధికారంలోకి రాగానే నాలుగు నెలల్లో 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
ముస్లింలను మోసం చేసింది: ఉత్తమ్
టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్‌ఎస్ రిజర్వేషన్ల పేరిట ముస్లింల ఓట్లు దండుకుని, అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిందని విమర్శించారు. ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి మాట్లాడుతూ తాము కల్పించిన రిజర్వేషన్లతో లక్షలాది ముస్లింలకు మేలు జరిగిందని చెప్పారు.

విద్యా వ్యాపారులకు కాంగ్రెస్ అండ
మండిపడ్డ టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 19: కొందరు ప్రైవేటు విద్యా సంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి, కనీస నియమ నిబంధనలు పాటించకుండా విద్యా సంస్థలను నడుపుతుంటే కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలవడం విడ్డూరంగా ఉందని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు కర్నెప్రభాకర్, భాను ప్రసాద్‌లు విమర్శించారు. టిఆర్‌ఎస్ శాసన సభాపక్షం కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు చేస్తున్న అక్రమాలకు అండగా నిలవడం తగదని కర్నె ప్రభాకర్ అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు విద్యార్థుల కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను వ్యయం చేస్తోంది. దీనిని ప్రభుత్వం ఖర్చుగా భావించడం లేదు, మానవ వనరుల అభివృద్ధికి పెడుతున్న పెట్టుబడిగా భావిస్తోందని తెలిపారు. ఇన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాల్సిన అవసరం ఉందని అన్నారు. నాణ్యత లేకుండా సౌకర్యాలు లేకుండా, బోధనా సిబ్బంది లేకుండా విద్యా సంస్థలు మా ఇష్టం వచ్చినట్టు నడుపుతాం, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటాం అంటే ప్రభుత్వం వౌనంగా ఉంటుందా? ఇలాంటి వారికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మద్దతు పలకడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ నాయకులు తాము ప్రజల వైపు ఉండాలా? అక్రమాలకు పాల్పడే కొద్దిమంది ప్రైవేటు విద్యా సంస్థల వైపు ఉండాలో తేల్చుకోవాలని అన్నారు. కనీస వసతులు లేని విద్యాసంస్థలపై ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. కళాశాల్లో సౌకర్యాలు ఉంటే తనిఖీకి వస్తే భయపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చట్ట ప్రకారమే ప్రైవేటు విద్యా సంస్థలను తనిఖీ చేయనున్నట్టు కర్నె ప్రభాకర్ తెలిపారు.