తెలంగాణ

జూరాలకు వరద ఉద్ధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, అక్టోబర్ 15: ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి వస్తున్న వరద ఉధృతితో పాటు కృష్ణానది, భీమా నదుల నుండి వస్తున్న వరద నీటితో జూరాల వద్ద వరద ఉదృత్తి కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం నాటికి జూరాల జలాశయంలో 318.410 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 1,18,000 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 16 గేట్లను తెరిచి దిగువకు 75,752 క్యూసెక్కులు, జలవిద్యుత్పత్తి కోసం 40 వేల క్యూసెక్కుల నీరు, సమాంతర కాలువకు 250 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాలువలకు 2052 క్యూసెక్కుల వంతున మొత్తం 1,18,054 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాలకు తగ్గుతూ, పెరుగుతూ వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఎప్పటికప్పుడు జూరాల అధికారులు నీటి నిల్వ సామర్థ్యాన్ని గ్రహించి గేట్ల ద్వారా దిగువకు నీటిని వదులుతున్నారు. జూరాల జలవిద్యుత్ కేంద్రం ద్వారా 6 యూనిట్లలో ఉత్పత్తి చేపడుతున్నట్లు జెన్‌కో అధికారులు తెలిపారు.