తెలంగాణ

టిఆర్‌ఎస్ నేత అయూబ్ ఖాన్ కుటుంబానికి రూ. 30 లక్షల సహాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన టిఆర్‌ఎస్ నాయకుడు అయూబ్ ఖాన్ కుటుంబానికి పార్టీ తరఫున రూ.30 లక్షల సహాయాన్ని అందజేసింది. బేగంపేట క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉప ముఖ్యమంత్రి మహబూబ్ అలీ, మంత్రులు కె తారకరామారావు, పి మహేందర్‌రెడ్డి అయూబ్ ఖాన్ కుటుంబ సభ్యులకు చెక్కు అందజేసారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, పార్టీకి సేవలు అందించిన ప్రతీ ఒక్కరికీ కచ్చితంగా గుర్తింపు లభిస్తుందని హామీ ఇచ్చారు. అయూబ్ ఖాన్ కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు.