తెలంగాణ

గద్వాలలో చేనేత క్లస్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: పట్టు చీరలకు ప్రసిద్థిగాంచిన గద్వాలలో చేనేత క్లస్టర్ ఏర్పాటు చేయడానికి చేనేత, మున్సిపల్‌శాఖ మంత్రి కె తారకరామారావు హామీ ఇచ్చారు. ఇన్‌ఫ్రాస్టక్చర్ లీసింగ్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ నివేదిక ఆధారంగా క్లస్టర్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే గద్వాల మున్సిపాల్టీకి వారం రోజుల్లో రూ. 26 కోట్లు విడుదల చేయనున్నట్టు మంత్రి హామీ ఇచ్చారు. గద్వాల జిల్లా ఇంచార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల బృందం మంగళవారం సచివాలయంలో మంత్రి కెటిఆర్‌ను కలిసింది. ఈ సందర్భంగా గద్వాల పట్టణంలో సిసి రోడ్లు, పార్క్, డ్రైనేజి నిర్మాణాలకు నిధులు మంజురు చేయాలని కోరగానే వారం రోజుల్లో రూ.26 కోట్లు విడుదల చేయనున్నట్టు మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారు.