తెలంగాణ

‘రోహిణీ మృతుల కుటుంబాలకు 25 లక్షలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: వరంగల్ అర్బన్ జిల్లాలోని హన్మకొండ పట్టణంలో గల రోహిణి ఆసుపత్రిలో జరిగిన ప్రమాద ఘటనపై విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ గ్యాస్ లీకై మంటలు వ్యాపించడంతో రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారి ఆపరేషన్ థియేటర్‌లోనే ఒకరు మృతి చెందడం, మరోకరు ఎంజిఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స మృతి చెందడం అత్యంత బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రోహిణి ఆసుపత్రి యాజమాన్యం కనీస జాగ్రత్తలు పాటించకపోవడంపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.