తెలంగాణ

అమర పోలీస్ కుటుంబాలకు భరోస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధినిర్వహణలో ప్రాణాలు పోగొట్టుకున్న పోలీస్ కుటుంబ సభ్యులకు నేనున్నానంటూ రాచకొండ పోలీస్ కమిషనర్ భరోస కల్పించారు. తీవ్రవాదుల కారణంగా 17 మంది పోలీసులు విధినిర్వహణలో తమ ప్రాణాలు కోల్పోయారు. బుధవారం రాచకొండ కమిషనర్ మహేశ్ ఎం భగవత్ అమర పోలీసుల కుటుంబాల ఇంటికి పోలీసులను పంపించి వారిని ఓదార్చి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మీకు మేమున్నామని భరోసా కల్పిస్తూ, స్వీట్లు, గిఫ్టు ప్యాకెట్లు అందజేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చౌటుప్పల్ డివిజన్‌లో పది మంది ఎస్‌ఐలు ఎండి చాంద్‌పాషా, డి సిద్ధయ్య, ఏఎస్‌ఐ సుల్తాన్ మొయినుద్దీన్, హెడ్ కానిస్టేబుల్ ఎండి అలీమొద్దీన్, కానిస్టేబుళ్లు జి లక్ష్మయ్య, ఎండి అఫ్జల్ శరీఫ్, జి శ్రీరామ్‌రెడ్డి, పి ప్రసాద్, సిహెచ్ నాగరాజు, హోగార్డు లింగయ్య, భువనగిరి డివిజన్‌లో ముగ్గురు కానిస్టేబుళ్లు ఎస్ లక్ష్మినారాయణ, బి శ్రీనివాసులు, ఎస్ వెంకటరత్నం, ఇబ్రహీంపట్నం డివిజన్‌లో నలుగురు ఎస్‌ఐ జి సైదయ్య, కానిస్టేబుళ్లు జమీల్ అహ్మద్, ఎం రాజేశ్వర్ రావు, కె సాయిలు కుటుంబ సభ్యుల ఇళ్లకు వెళ్లి స్వీట్ బాక్స్‌తోపాటు బాణసంచా, మట్టి ప్రమిదతలు ఇచ్చి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మహేశ్ భగవత్ మాట్లాడుతూ, అమర పోలీస్ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలేవైనా ఉంటే..తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కమిషనర్‌కు జాయింట్ కమిషనర్ తరుణ్ జోషి, డిసిపి ప్రకాష్‌రెడ్డి, ఏసిపి స్పెషల్ బ్రాంచ్ మహేశ్‌లకు, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి, సభ్యుడు కృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.