తెలంగాణ

విద్యార్థులకు విద్యుత్ వినియోగంపై చిత్రలేఖన పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: కేంద్ర విద్యుత్ శాఖ, ఎన్‌టిపిసి సంయుక్తంగా విద్యుత్ వినియోగం అనే అంశంపై పాఠ శాల విద్యార్థులకు జాతీయ స్థాయి చిత్ర లేఖన పోటీలు నిర్వహిస్తున్నాయి. 4, 5, 6 తరగతులు (గ్రూప్ ఎ), 7, 8, 9 తరగతులు (గ్రూప్ బి)గా విభజించి అక్టోబర్ 30 లోగా పోటీలు నిర్వహించాలని ఆయా పాఠశాలలను రెండు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో కోరాయి. వాటిలో ఉత్తమమైన రెండింటిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించాలని తెలిపింది. నవంబర్ 14న హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరవుతున్నట్లు పేర్కొంది. ఈ పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు పాల్గొనవచ్చని తెలిపింది.
మార్కెట్ల అభివృద్ధికి ఉన్నతస్థాయి కమిటీ
హైదరాబాద్, అక్టోబర్ 18: తెలంగాణలో వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధితో పాటు ఎక్కడైనా మార్కెట్లను మార్చాలనుకుంటే ఆ అంశం పరిశీంచేందుకు ప్రత్యేకంగా ఉన్నతస్థాయి కమిటీని వేశారు. రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యాన, పారిశ్రామిక తదితర రంగాలకు చెందిన 9 మందిని సభ్యులుగా నియమించారు. వ్యవసాయ కమిషనర్ ఈ కమిటీకి మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. మార్కెటింగ్‌కు సంబంధించి వివిధ సమస్యలను పరిష్కరించేందుకు కూడా ఈ కమిటీ పనిచేస్తుంది.
విజయవాడకు రెండు ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్, అక్టోబర్ 18: విజయవాడ-సికింద్రాబాద్-విజయవాడ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 22వ తేదీ రాత్రి 10 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక రైలు బయలుదేరుతుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ఈ నెల 23న సికింద్రాబాద్ నుంచి రాత్రి 11.55 గంటలకు బయలుదేరుతుందని తెలిపింది.
మాజీ సిఎం అంజయ్యకు కాంగ్రెస్ నేతల నివాళి
హైదరాబాద్, అక్టోబర్ 18: మాజీ ముఖ్యమంత్రి టి. అంజయ్య జయంతి సందర్భంగా టి.కాంగ్రెస్ నాయకులు ఆయనకు నివాళి అర్పించారు. బుధవారం అంజయ్య జయంతిని పురస్కరించుకుని లుంబినీ పార్కులో ఉన్న అంజయ్య విగ్రహానికి టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పూల దండ వేసి నివాళి అర్పించారు.
అనంతరం గాంధీ భవన్‌లో అంజయ్య చిత్ర పటానికి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పూల దండ వేసి నివాళి అర్పించారు. పార్టీ నాయకులూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.