తెలంగాణ

కువైట్ బందీల విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: తెలంగాణ నుండి ఉపాధికోసం తొమ్మిది నెలల కింద కువైట్ వెళ్లిన ఇద్దరిని అక్కడి బడావ్యాపారవేత్త బానిసలుగా మార్చి, బందీ చేయడంతో రాష్ట్ర మంత్రి కెటిఆర్ చొరవతో వారు విముక్తులయ్యారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మగ్గిడి శేఖర్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కందుల సాయికుమార్ తొమ్మిది నెలల కింద కువైట్ వెళ్లారు. ఎలక్ట్రిషియన్స్‌గా ఉద్యోగం ఇస్తామని ఇద్దరినీ ప్రలోభ పెట్టిన కువైట్ వ్యాపారి నాజ్ అల్ సలీం కుర్బానీ వారిద్దరిని వ్యవసాయ పనుల్లో వినియోగించుకుంటున్నాడు. ఈ ఇద్దరికీ సరైన ఆహారం ఇవ్వకుండా సదరు యజమాని హింసించాడు. ఈ విషయం తెలిసిన ఐటి, పరిశ్రమలు, ఎన్‌ఆర్‌ఐ మంత్రి కెటిఆర్ వెంటనే కువైట్‌లోని ఇండియన్ ఎంబసీకి సమాచారం అందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కువైట్‌లోని భారతీయ రాయబారితో పాటు గంగుల మురళీధర్‌రెడ్డి అనే సామాజిక కార్యకర్త చొరవ తీసుకుని, అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే సలీం వద్ద బంధీలుగా ఉన్న ఇద్దరినీ పోలీసులు విడిపించి, భారతీయ అంబాసిడర్ ద్వారా శనివారం హైదరాబాద్ పంపించారు. వీరిద్దరు ఆదివారం తమ తమ స్వస్థలాలకు వెళుతున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.