తెలంగాణ

శ్రీ్ధర్ బాబుపై టిఆర్‌ఎస్ కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: తమ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శ్రీ్ధర్ బాబును రాజకీయంగా అణగదొక్కేందుకు టిఆర్‌ఎస్ కుట్ర చేసిందని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. అందుకే గంజాయి కేసు పెట్టి వేధించాలని చూస్తున్నదని ఆయన సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. దీనిని తాము ఎదుర్కొంటామని, శ్రీ్ధర్ బాబుకు అండగా ఉంటామని ఆయన తెలిపారు. టిఆర్‌ఎస్ నాయకులు కమీషన్లకు అలవాటు పడి పాలన సాగిస్తున్నారని, ఇందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టును రీ-డిజైన్ పేరిట కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై శ్రీ్ధర్ బాబు ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తున్నందున, జీర్ణించుకోలేకపోయిన టిఆర్‌ఎస్ నాయకులు ఈ విధంగా కుట్ర చేశారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు చేస్తున్న వారిని పాలకులు ఉక్కుపాదంతో అణచి వేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇలాంటి ఆగడాలకు తమ పార్టీ భయపడదని, ఎదుర్కొంటుందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి హెచ్చరించారు.
రాజకీయ కక్ష సాధింపు: రమ్యారావు
టి.పిసిసి అధికార ప్రతినిధి రేగులపాటు రమ్యారావు మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి శ్రీ్ధర్ బాబుపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసు పెట్టించిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు భూ నిర్వాసితుల పక్షాన నిలబడి పోరాడుతున్నందుకే ఆయనపై కేసు పెట్టించిందని ఆమె విమర్శించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు చిత్తశుద్ధి ఉంటే ముందు సొంత పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్యాంగ్‌స్టర్ నరుూం కేసులో నిందితునిగా ఉన్న విద్యాసాగర్ రావుపై ఎందుకు చర్య తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు. సిరిసిల్ల ఇసుక మాఫీయాపై ఎందుకు కేసులు పెట్టలేదని రమ్యారావు ప్రశ్నించారు.