తెలంగాణ

వైద్యరంగంలో హార్వర్డ్ యూనివర్సిటీ సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య రంగంలో లక్ష్యాల సాధనకు సహకారం అందించేందుకు అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. ఈ యూనివర్సిటీకి సంబంధించిన సచిన్ బల్సారీ , తరుణ్ కన్నాలు తెలంగాణ వైద్య ఆరోగ్యమంత్రి లక్ష్మారెడ్డితో సమావేశమయ్యారు. వేర్వేరు దేశాల్లో వైద్య ఆరోగ్య రంగాల్లో హార్వర్డ్ యూనివర్సిటీ సహకారం అందిస్తోందని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీ సహకారం ఏ విధంగా తీసుకోవాలో క్షుణ్ణంగా అధ్యయనం చేసి, తనకు ఒక నివేదిక అందించాలంటూ మంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలోవైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, వైద్య ఆరోగ్య కమిషనర్ డాక్టర్ వాకాటి కరుణ, వైద్య సంచాలకుడు డాక్టర్ రమేష్‌రెడ్డి నిమ్స్ డైరెక్టర్, ఆరోగ్యశ్రీ సిఇఓ ప్రొఫెసర్ మనోహర్, వైద్య సంచాలకులు లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు.