తెలంగాణ

నేను తప్పు చేయలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఏప్రిల్ 21: నేను ఎలాంటి తప్పు చేయలేదని, వడ్డీ వ్యాపారం అసలే చేయలేదని అక్రమ వడ్డీ వ్యాపారం కేసులో అరెస్టయి సస్పెన్షన్‌కు గురైన ఎఎస్‌ఐ బొబ్బల మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పూర్వీకుల నుంచి వచ్చిన వందల ఎకరాల భూమితో ఆస్తులు సంపాదించానని తెలిపారు. తనకు వెయ్యి కోట్ల ఆస్తులు ఉన్నాయనడం నిజం కాదన్నారు. నేనే తప్పు చేయలేదని, నిర్ధోషిగా బయటకు వస్తానన్న నమ్మకం ఉందని, చట్టపరంగా ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని తెలిపారు. తనవద్ద ఉన్న ప్రతీ పైసకు ఐటి లెక్కలు ఉన్నాయని, అక్రమ ఆస్థులు అని నిరూపణ అయితే తన ఆస్థులను స్వాధీనం చేసుకోవచ్చునని చెప్పారు. తుపాకితో బెదిరించి ఆస్థులు లాక్కున్నారనడంలో వాస్తవం లేదని తెలిపారు. ఎలాంటి తప్పు చేయకున్నా తనపై అక్రమంగా కేసులు నమోదు చేశారని, వాటన్నింటిని చట్టపరంగా ఎదుర్కొంటానని మోహన్ రెడ్డి తెలిపారు.

అపోలో ఆసుపత్రిలో
అరుదైన గుండె చికిత్స
డాక్టర్ పి.రత్ బృందం వెల్లడి
హైదరాబాద్, ఏప్రిల్ 21: అపోలో ఆసుపత్రి వైద్యులు అరుదైన గుండె చికిత్స చేశారు. పెర్క్‌టానియన్ ట్రాన్స్‌కాథ్‌టర్ ఆటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ (టిఎవిఐ) అనే గుండె సంబంధిత చికిత్సా విధానంలో క్రిటికల్ అటిక్ స్టెనోసిస్‌తో బాధపడుతున్న 80 ఏళ్ల వృద్ధుడికి ఈ నెల 15న జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స చేశారు. డాక్టర్ పి.సి.రత్ తన బృందంలోని డాక్టర్ మనోజ్ అగర్వాల్, డాక్టర్ బి.దీక్షిత్, డాక్టర్ సుందర్‌ల సహకారంతో ఈ చికిత్సను నిర్వహించడం జరిగిందని అపోలో వర్గాలు తెలిపాయి. యాంజియోప్లాస్టీ నిర్వహించే మాదిరిగా రోగికి గజ్జలో తక్కువ వ్యవధితో కూడుకున్న సాధారణ మత్తు (అనస్తీషియా)ను ఇచ్చి కాథ్‌ల్యాబ్‌లో అటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ చేసినట్లు తెలిపారు. ఫ్లూరోస్కోపి, ట్రాన్స్ ఎసోపాజియల్ ఇసిహెచ్‌ఓ పరికరాల సహాయంతో ఈ వాల్వ్‌ను తొడలలో ఉండే ధమని నరం ద్వారా అమెరికాకు చెందిన ఎవోల్యూట్ అనే సెకండ్ జనరేషన్‌కు చెందిన వాల్వ్‌ను ఖచ్చితంగా గుండెకు అమర్చడం జరిగిందని డాక్టర్ రత్ బృందం వెల్లడించింది.

24న కానిస్టేబుళ్ల రాత పరీక్ష
హైదరాబాద్, ఏప్రిల్ 21: తెలంగాణ పోలీసు శాఖలో కానిస్టేబుళ్ల ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 24న రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ డాక్టర్ జె.పూర్ణచంద్రరావు తెలిపారు. పరీక్ష 24న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి గంట ముందు 1.30కి పరీక్షా కేంద్రానికి చేరుకుంటే వారిని లోపలికి అనుమతిస్తారని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితిలో పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1131 కేంద్రాల్లో 5,36,046 మంది అభ్యర్థులు రాత పరీక్ష రాసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. పరీక్ష హాలులో ప్రవేశించే ముందు అభ్యర్థుల బయోమెట్రిక్స్ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.