రాష్ట్రీయం

చలిపులి వచ్చేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: తెలంగాణలో పగటివేళ, రాత్రివేళ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. గత వారం రోజుల నుండి ఉష్ణోగ్రతల్లో మార్పులు రావడంతో చలి బాగా ఉంటోంది. జనం స్వెట్టర్లు వేసుకోవడం ప్రారంభించారు. రాజధాని నగరంలో సాధారణంగా వర్షాలు, ఎండలు ఏ విధంగా ఎక్కువగా ఉంటాయో, అదే విధంగా చలి కూడా ఎక్కువగా ఉంటోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో అత్యధిక పగటి ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ కాగా, అత్యల్పంగా 16 డిగ్రీలు నమోదైంది. రాష్ట్రం మొత్తంలో పరిశీలిస్తే ఆదిలాబాద్‌లో 12 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రం మొత్తంలో పగటివేళ ఉష్ణోగ్రతలు 29 నుండి 32 డిగ్రీల మధ్య నమోదవుతుండగా, రాత్రివేళ కనిష్ట ఉష్ణోగ్రతలు 16 నుండి 18 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఒక్క నల్లగొండ జిల్లాలో మాత్రమే రాత్రివేళ అత్యల్ప ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా నమోదైంది. అదే విధంగా గాలిలో తేమ శాతం కూడా హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్‌లలో ఎక్కువగా ఉంటోంది.