రాష్ట్రీయం

జలాశయాలను రక్షించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: రాష్ట్ర రాజధానిలోని జలాశయాలను కాపాడేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టులో గురువారం ప్రజాప్రయోజనాల వాజ్యం (పిల్) దాఖలైంది. హైదరాబాద్‌కు చెందిన ఎం. షహీరాబేగం అనే మహిళ ఈ పిటీషన్‌ను వేశారు. జలాశయాలన్నీ కబ్జాకు గురవుతున్నాయని, పరిశ్రమల వ్యర్థాలు, గృహాల్లోని వ్యర్థాలు ఈ జలాశయాల్లోకి చేరి జలాశయాల నీరు కలుషితం అవుతున్నాయన్నారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని వెల్లడించారు. జలాషయాలు కలుషితం కావడంతో భూగర్భజలాలు కూడా కలుషితం అవుతున్నాయని, దాంతో ప్రజల జీవనం దుర్భరంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అస్తమా, చర్మరోగాలు, కడుపునొప్పిలాంటి బాధలు, ఊపిరితిత్తుల సమస్యలకు ప్రజలు గురవుతున్నారని పిల్‌లో వివరించారు. వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని, ఈ కబ్జ్భాముల్లో గృహాలు, బహుళ అంతస్తుల మేడలు, పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయన్నారు. ఇంత దారుణం జరుగుతున్నప్పటికీ, సంబంధిత ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు పట్టించుకోవడం లేదని పిల్‌లో పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో హైకోర్టు జోక్యం చేసుకుని జలాశయాలను రక్షించాలని, ప్రజల ఆరోగ్యం రక్షించాలని, ప్రభుత్వ భూములు కబ్జాచెరనుండి బయటపడేలా చూడాలని షహీరాబేగం కోరారు.