తెలంగాణ

బాలికలే టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫస్టియర్‌లోనూ, సెకండియర్‌లోనూ బాలికలు తమ ప్రతిభాపాటవాలు చాటుకున్నారు. సెకండియర్‌లో 67.64 శాతం ఉత్తీర్ణులు కాగా, ఫస్టియర్‌లో 58.9 శాతం మంది ఉతీర్ణులయ్యారు. అదే బాలురు వరకూ తీసుకుంటే సెకండియర్‌లో 58.11 శాతం ఉతీర్ణులుకాగా, ఫస్టియర్‌లో 48 శాతం ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 3,89,883 మంది హాజరుకాగా అందులో ఎ గ్రేడ్‌లో 129636 మంది, బి గ్రేడ్‌లో 73818 మంది, సి గ్రేడ్‌లో 31496 మంది, డి గ్రేడ్‌లో 10519 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం మీద 62.95 శాతం మంది అంటే 2,45,469 మంది ఉత్తీర్ణులయ్యారని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. 1,98,266 మంది బాలికలు హాజరుకాగా, వారిలో 67.64 శాతం 1,34,111 మంది, 1,91, 617 మంది బాలురకు గానూ 58.11 శాతం 111358 మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. అలాగే ప్రైవేటు అభ్యర్ధులు 26.7 శాతం, వొకేషనల్ అభ్యర్ధులు రెగ్యులర్ 59.17 శాతం, ప్రైవేటు అభ్యర్ధులు 45.83 శాతంఉత్తీర్ణులయ్యారని అన్నారు.
ఫస్టియర్ పరీక్షలకు జనరల్ అభ్యర్ధులు 4,20,180 మంది వొకేషనల్ అభ్యర్ధులు 36,495 మంది హాజరయ్యారని అం దులో ఏ గ్రేడ్‌లో 1,10,242 మంది, బి గ్రేడ్‌లో 67,150 మం ది, సి గ్రేడ్‌లో 32,208 మంది, డి గ్రేడ్‌లో 15,433 మంది ఉత్తీర్ణులయ్యారని మొత్తం మీద 53.55 శాతం అంటే 225033 మంది పాసయ్యారని చెప్పారు. బాలికలు 58.9 శాతం, బాలురు 48 శాతం ఉతీర్ణులయ్యారని పేర్కొన్నారు. వొకేషనల్ కోర్సులో 50.6 శాతం పాసయ్యారని, బాలికలు 62.58 శాతం, బాలురు 41.81 శాతం ఉత్తీర్ణులయ్యారని అన్నారు.
నిరుటితో పోలిస్తే ఎక్కువ
నిరుడు సెకండియర్‌లో 61.41 శాతం ఉత్తీర్ణులు కాగా, ఈ ఏడాది 62.95 శాతం పాసయ్యారు. 2014లో 60.14 శాతం పాసయ్యారు. అయితే ఫస్టియర్‌లో 2014లో 52.65 శాతం, 2015లో 55.62 శాతం పాస్ కాగా ఈ ఏడాది 53.55 శాతం పాసయ్యారు.
జిల్లాల వారీ ఉత్తీర్ణత
సెకండియర్‌లో ఆదిలాబాద్ 60 శాతం , మెదక్‌లో 53 శాతం, రంగారెడ్డిలో 76 శాతం, నిజామాబాద్‌లో 62 శాతం, మహబూబ్‌నగర్‌లో 55 శాతం, కరీంనగర్‌లో 58 శాతం, ఖమ్మంలో 65 శాతం, వరంగల్‌లో 59 శాతం, నల్గొండలో 53 శాతం, హైదరాబాద్‌లో 63 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియెం, నిజావాబాద్ 48 శాతం, మహబూబ్‌నగర్ 44 శాతం, కరీంనగర్‌లో 47 శాతం, ఖమ్మం 55 శాతం, వరంగల్ 48 శాతం, నల్గొండ 41 శాతం, హైదరాబాద్ 56 శాతం ఉత్తీర్ణులయ్యారు.
ప్రభుత్వ కాలేజీల్లోనే ఉత్తీర్ణత
ప్రైవేటు కాలేజీల కంటే ప్రభుత్వ కాలేజీల్లోనే ఈ ఏడాది మంచి ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వ కాలేజీల ఉత్తీర్ణత 60 శాతం కాగా, ఎయిడెడ్ కాలేజీల్లో 46 శాతం, ప్రైవేటు కాలేజీల్లో 63 శాతం, రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 79 శాతం, సోషల్ వెల్ఫేర్‌లో 80 శాతం, ట్రైబల్ వెల్ఫేర్ 86 శాతం, మోడల్ స్కూళ్లలో 64 శాతం ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్ ఫలితాలు చూస్తే ప్రభుత్వ కాలేజీల్లో ఆదిలాబాద్‌లో 82 శాతం, మెదక్ 72 శాతం, రంగారెడ్డి 59 శాతం, నిజామాబాద్ 73 శాతం, మహబూబ్‌నగర్ 67 శాతం, కరీంనగర్ 58 శాతం, ఖమ్మం 58 శాతం, వరంగల్ 60 శాతం, నల్గొండ 70 శాతం, హైదరాబాద్ 47 శాతం ఉత్తీర్ణులయ్యారు.