తెలంగాణ

శాస్ర్తియబద్ధంగా లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: జిల్లాల పునర్ విభజన అంశం శాస్ర్తియబద్ధంగా జరగలేదని అసెంబ్లీలో విపక్షాల నేతలు విమర్శించారు. ‘రాష్ట్రంలో పరిపాలనా సంస్కరణలు-నూతన పాలనా వ్యవస్థ’ అనే అంశంపై శుక్రవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ లక్కీ నెంబర్ ఆరు కాబట్టి తొలుత 2+4=6 అంటే 24 జిల్లాలు చేస్తారన్న ప్రచారం జరిగినా, ఆ తర్వాత 31 జిల్లాలు ఎందుకు పెంచారని ప్రశ్నించారు. ఈ దశలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సంపత్ ప్రసంగానికి అడ్డుపడగా, ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలు పెంచారు కానీ ఉద్యోగ నియామకాలు ఎప్పుడని ప్రశ్నించారు. హైదరాబాద్ జిల్లాను ఎందుకు ముట్టుకోలేదని ప్రశ్నించారు. మజ్లిస్ కనుసన్నల్లో పునర్ విభజన జరిగిందేమోనన్న అపవాదు ఉందన్నారు. చాక్లెట్లు, బిస్కట్ల తరహాలో జిల్లాలు ఇచ్చారని ఆయన విమర్శించారు. వీటిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదని, గెజిట్ విడుదల చేయలేదన్నారు. స్థానిక, స్థానికేతర సమస్య టిఆర్‌టిలో తలెత్తిందని, కోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు.
బిజెపి శాసనసభాపక్షం నాయకుడు జి. కిషన్‌రెడ్డి ప్రసంగిస్తూ జిల్లాల పునర్ విభజన శాస్ర్తియబద్ధంగా జరగలేదని విమర్శించారు. పరిపాలనా వికేంద్రీకరణ జరగాలన్న ఉద్ధేశ్యంతో తమ పార్టీ ఉందని, అందుకే ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాలను ఏర్పాటు చేసిందని ఆయన ఉదహరించారు. 39,500 విఆర్వోలు ఉండాలని ప్రభుత్వం చెప్పినా 6 వేల ఉద్యోగులే ఉన్నారని ఆయన తెలిపారు. కేంద్రం నుంచి తప్పకుండా సాయం అందుతుందని అన్నారు.
భద్రాచలంను ఏర్పాటుచేయండి: సున్నం
సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రసంగిస్తూ భద్రాచలం జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రసంగిస్తూ కొత్త జిల్లాల్లో జనాభా వ్యత్యాసం ఉందని విమర్శించారు. ఐటిడిఎలను ఏ విధంగా సరి చేస్తారని ప్రశ్నించారు. జోనల్ వ్యవస్థను ఏ విధంగా దృష్టిలో పెట్టుకుంటారని ఆయన ప్రశ్నించారు. మజ్లిస్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ కొత్త జిల్లాల ఏర్పాటును అభినందించారు.