తెలంగాణ

ఇందిరమ్మ సేవలు ఎనలేనివి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 19: దేశాభివృద్ధిలో దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చేసిన సేవలు అమోఘం, అత్యంత కీలకమైనవని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం ఇందిరా గాంధీ శత జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. తొలుత నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహానికి పార్టీ నాయకులు పూల దండ వేసి నివాళి అర్పించారు. అనంతరం గాంధీ భవన్‌లో ఇందిర చిత్ర పటానికి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పూల దండ వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్ర రావు, ఎంఎ ఖాన్, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు దానం నాగేందర్, డి. శ్రీ్ధర్ బాబు, మాజీ ఎంపి అంజన్‌కుమార్ యాదవ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ళ శారద, సేవాదళ్ చైర్మన్ కనుకుల జనార్థన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జెండా పండుగలో భాగంగా గాంధీ భవన్ ఆవరణలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రసంగిస్తూ ఇందిరమ్మ దేశానికి చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని అన్నారు. ఉక్కు మహిళగా ఆమె తీసుకున్న ధీటైన నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా దేశానికి మంచి గుర్తింపునిచ్చాయని ఆయన తెలిపారు. దేశాన్ని అభివృద్ధి చేయడంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఇందిరమ్మ విశేషంగా కృషి చేశారని అన్నారు. గరీబీ హఠావో పేరిట పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేశారని, పేదల ఆర్థిక స్థితిగతులను మార్చారని ఆయన చెప్పారు. నేడు మన దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఆమె వేసిన బాటలే కారణమని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన మహిళగా గుర్తింపు పొందారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం శ్రమించాలని ఆయన కోరారు.
ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా యువజన కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఇలాఉండగా గాంధీ భవన్ ఆవరణలో ఉన్న ఇందిరా భవన్ (ఎపి కాంగ్రెస్ కార్యాలయం)లో కూడా ఇందిరా గాంధీ జయంతి వేడుకలను రెండు రాష్ట్రాల నాయకులు నిర్వహించుకున్నారు. కెవిపి రామచంద్ర రావు తెలంగాణ నాయకులకు స్వాగతం పలికారు. జిల్లాల్లోనూ పార్టీ శ్రేణులు ఇందిర జయంతిని నిర్వహించారు.

చిత్రం..మాజీ ప్రధాని ఇందిరాగాంధీ శత జయంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న పీసీసీ నేత ఉత్తమ్, షబ్బీర్‌అలీ, అంజన్‌కుమార్ యాదవ్. కేవీపీ తదితరులు.