తెలంగాణ

కల్వకుర్తిలో వలసల పర్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 21: కల్వకుర్తి నియోజకవర్గంలో రాజకీయ వలసల పర్వం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి తన వ్యూహాలకు పదునుపెడుతూ టీఆర్‌ఎస్ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని వారిని త మ పార్టీలోకి చేర్చుకునేందుకు పావులు కదుపుతూ ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా మంగళవారం నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్, టీడీపీ, వైకాపాలకు సంబంధించిన వేలాది మంది గ్రామస్థాయి, మండల స్థాయి నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. హైదరాబాద్ గాంధీభవన్‌కు బయలుదేరే ముందు కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి తమ బలప్రదర్శనను నిరూపించారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌పార్టీలో గ్రూపుల కుంపట్లు ఉండేవి. ఇందులో ప్రధానంగా కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని నియోజకవర్గం నుండి ఒకేరోజు వివిధ పార్టీలకు చెందిన వారిని 1000 మందికిపైగా కాంగ్రెస్‌లో చేర్పించుకోవాలనే వ్యూహం ఫలించింది. ఈ నియోజకవర్గానికి చెందిన కేంద్రమాజీ మంత్రి జైపాల్‌రెడ్డి సైతం తన అనుచరులకు అంతా ఏకం కావల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి ఆధ్వర్యంలో నడుచుకోవాల్సిందేనని సూచించడంతో ఆయన వర్గీయులు కూడా వంశీతో ఐక్యతగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా మాజీ చిత్తరంజన్‌దాస్ కూడా ఇదే నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనకు కూడా ఓ వర్గం అంటూ ఉంది. 2014 ఎన్నికల్లో వంశీచంద్‌రెడ్డి ఒంటిచేతి తో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వెంటబెట్టుకుని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఎమ్మెల్యేగా గెలుపొందడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అప్పట్లో కాంగ్రెస్‌లోని కొం దరు వంశీచంద్‌రెడ్డికి సహకరించలేదనే ఆరోపణలు ఉన్నాయి. వాటన్నింటినీ ఇక పక్కన పెట్టి టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవాలనే లక్ష్యంతోనే మంగళవారం నియోజకవర్గం నుండి వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్‌లో చేరడానికి ముఖ్యకారణం వంశీచంద్‌రెడ్డి వ్యూహంతో పాటు కాంగ్రెస్ నేతలంతా ఏకతాటిపైన నడుస్తున్నట్లు సంకేతాలను ఇచ్చారు. గాంధీభవన్‌లో జైపాల్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కుంతియాతో పార్టీ నేతల సమక్షంలో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన వేలాది మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అనుచర వర్గంతో స్వగ్రామం అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండ లం కొండారెడ్డిపల్లి గ్రామం అయినప్పటికీ కల్వకుర్తికి కూతవేటు దూరంలో ఉండడంతో పాటు 2009 వరకు కల్వకుర్తి నియోజకవర్గంలోనే వంగూరు మండలం ఉండడంతో రేవంత్‌రెడ్డి ప్రభావం కూడా కల్వకుర్తి నియోజకవర్గంలో ఉంటుంది.

చిత్రం..పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి సమక్షంలో
హైదరాబాద్‌లో కాంగ్రెస్‌లో చేరిన వివిధ పార్టీల నాయకులు