తెలంగాణ

ఎంపీలు, ఎమ్మెల్యేలనూ సదస్సుకు ఆహ్వానించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు రాష్ట్రానికి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులను ఆహ్వానించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. గ్లోబల్ ఎకానమి, పారిశ్రామిక రంగంపై తనకు ఆసక్తి ఉందని, అయితే ఈ సమ్మిట్‌కు ఆహ్వానం లేకపోవడం వల్ల నిరుత్సాహానికి గురయ్యానని ఆ లేఖలో ఆయన వాపోయారు. దేశ విదేశాల నుంచి వచ్చే వారు ఎన్నో అంశాలను ఈ వేదికగా చర్చించడం జరుగుతుందని, ఆ అంశాల పట్ల అవగాహన తెచ్చుకునేందుకు ప్రజాప్రతినిధులకు కూడా ఆహ్వానం పంపితే మంచిదని సూచించారు. ఇలా ఆహ్వానించడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు కూడా మంచిదని ఆయన పేర్కొన్నారు.
రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎఐసిసి నేత వి హనుమంతరావు ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామంలో రైతు ఆత్మహత్య చేసుకుంటే కనీసం సిఎం కెసిఆర్ స్పందించ లేదని, ఆ కుటుంబానికి ఎలాంటి భరోసా కల్పించలేదని అన్నారు. గురువారం నాడు హనుమంతరావు చింతమడక గ్రామాన్ని సందర్శించి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించారు. ఇంతవరకు పోలీసులు గానీ, జిల్లా యంత్రాంగం గానీ ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని అన్నారు. కాంగ్రెస్ నేత శ్రవణ్‌కుమార్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న రైతుకు, దుబాయ్‌లో ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబానికి చెరో రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందించారని విహెచ్ తెలిపారు. అలాగే గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 24న నిర్వహించనున్న సన్‌బర్న్ పార్టీని ప్రభుత్వం నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి వాటికి ప్రభుత్వం ఎలా అనుమతించిందని ప్రశ్నించారు.