తెలంగాణ

ఆర్టీసీకి మెట్రో తోడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: హైదరాబాద్ మెట్రో, తెలంగాణ ఆర్టీసి కలిసి రాజధాని నగర ప్రజలకు మెరుగైన రవాణాసౌకర్యం కల్పిస్తున్నట్టు రాష్ట్ర రవాణా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో గురువారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మట్లాడుతూ, హైదరాబాద్ మెట్రోరైల్ తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థకు మణిహారంగా ఉంటుందన్నారు. దేశంలో కోల్‌కటా, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కొచ్చిన్ తర్వాత హైదరాబాద్‌కు ఏడవ మెట్రోరైల్ వ్యవస్థ కలిగిన నగరంగా పేరువచ్చింద్నారు. మెట్రోతో ఆర్టీసిని అనుసంధానం చేస్తూ ప్రజలకు రవాణా సేవలను అందించేందుకు బృహత్‌ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా ఈ నెల 28 న ప్రారంభం అవుతున్న హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణీకులకు ఆర్టీసి సేవలు అందించేందుకు రంగం సిద్ధం చేసిందన్నారు.
అమీర్‌పేట-సికింద్రాబాద్ మీదుగా మియాపూర్-నాగోల్ మధ్య 30 కిలోమీటర్లవరకు మెట్రోరైల్ తొలిదశ ప్రారంభమవుతోందని మహేందర్‌రెడ్డి గుర్తు చేశారు. మెట్రోరైల్‌కు అనుసంధానంగా తొలివిడతలో ఐటి కారిడార్‌లో 10 రూట్లలో 50 బస్సులను ప్రయోగాత్మకంగా నడిపిస్తున్నామన్నారు. మొత్తంమీద మెట్రోరైల్ 24 స్టేషన్లలో ఇరువైపులా 22 కాలనీలకు ఆర్టీసి 212 ట్రిప్పుల బస్సులను నడిపించాలని ప్రణాళిక రూపొందించామన్నారు. ప్రజల అవసరాలపై సర్వే నిర్వహిస్తున్నామని, సర్వే నివేదికను అనుసరించి బస్సుల సంఖ్య పెంచుతామన్నారు. కాలనీల అవసరాలను గుర్తించి మినీ బస్సుల సంఖ్యను కూడా పెంచుతామన్నారు. మెట్రోరైల్ మార్గంలో ఆర్టీసి ఇప్పటికే 1700 బస్సులను నడిపిస్తోందని తెలిపారు. వాతావరణ కాలుష్యం జరగకుండా కొత్త బస్సులను ఏర్పాటు చేస్తున్నామని, ఉన్నంతలో ఎలక్ట్రిల్ బస్సుల సేవలను వినియోగించుకుంటామన్నారు. ముంబాయి, బెంగుళూరు తరహాలో రవాణా సేవలను అందిస్తామని హామీ ఇచ్చారు. పార్కింగ్, బస్‌బేలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ జంటనగరాల్లో బస్‌స్టాండ్ల నిర్మాణానికి, అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మెట్రోరైల్‌తో కలిసి ఆర్టీసి సంయుక్తంగా టిక్కెట్లను ప్రవేశపెట్టే ఆలోచన ప్రస్తుతానికి లేదని మంత్రి వివరించారు.
గ్లోబల్ సమ్మిట్‌కు 90 బస్సులు
హైదరాబాద్‌లో ఈ నెల 28 నుండి 30 వరకు ఏర్పాటవుతున్న అంతర్జాతీయ వాణిజ్య వేత్తల సమావేశానికి ఆర్టీసి 90 బస్సులను సమకూరుస్తోందని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. గ్లోబల్ సమ్మిట్‌కు 150 దేశాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారని, వీరికోసం 60 మల్టీ యాక్సిల్ ఒల్వో బస్సులు, తెలంగాణ టూరిజం 10 బస్సులను నడిపిస్తుందన్నారు. ప్రతినిధుల గౌరవార్థం ఈ నెల 29 న ముఖ్యమంత్రి కెసిఆర్ గోల్కొండ కోటలో ఇస్తున్న విందుకోసం మరో 30 ఎసి వజ్ర బస్సులను నడిపిస్తామన్నారు. ప్రతినిధులు విమానాశ్రయం నుండి హోటళ్లకు, హోటళ్ల నుండి సమావేశం జరిగే హైటెక్స్ వరకు, తిరిగి ఇవే రూట్లలో ప్రతినిధులు వెళ్లేందుకు ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించామని వివరించారు.
మంత్రి మహేందర్‌రెడ్డితో పాటు ఆర్టీసి ఎండి రమణారావు, గ్రేటర్‌జోన్ ఈడి పురుషోత్తం నాయక్‌లు కూడా పాల్గొన్నారు.

చిత్రం..గురువారం సచివాలయంలో విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రి మహేందర్ రెడ్డి