తెలంగాణ

నిబంధనలకు విరుద్ధంగా రుణాల మంజూరు కేసులో ఐదుగురికి జైలు శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 30: బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా రుణాలు మంజూరు చేసిన కేసులో ఇద్దరు బ్యాంక్ అధికారులతో సహా ఐదుగురికి సీబీఐ కోర్టు జైలుశిక్షతోపాటు రూ. 4.95 లక్షల జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. హైదరాబాద్ విజయా బ్యాంక్ మేనేజర్ పి రాధాగోపాల్‌రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ ఉదయ్ శంకర్, ప్రైవేట్ వ్యక్తులు రమణాజీరావు, సీతారామరావు, ఏవి సుబ్బారావు కలసి బ్యాంకు నిబంధనలను అతిక్రమిస్తూ 22 మందికి రూ. 1.27 కోట్లు అక్రమంగా రుణాలు మంజూరు చేశారు. సదరు రుణం పొందిన వారు బ్యాంకు రుణాలు చెల్లించకపోవడమే కాకుండా తప్పుడు పత్రాలు సృష్టించారు. ఈ కేసులో ఏ1 నిందితుడు విజయా బ్యాంక్ మేనేజర్ రాధాగోపాల్‌రెడ్డికి వేర్వేరు కేసుల్లో యు/ఎస్ 120-బి కింద మూడేళ్ల జైలుశిక్ష, రూ. 10వేల జరిమానా, మరో కేసు యు/ఎస్ 420 కింద ఐదేళ్ల కారాగార శిక్షతోపాటు రూ. 25వేలు జరిమానా, అదేవిధంగా మరో కేసు యు/ఎస్ 460 కింద ఏడాది పాటు, యు/ఎస్ 471 కింద మరోఏడాది జైలు శిక్షతోపాటు రూ. 10వేల చొప్పున జరిమానా విధిస్తూ సీబీఐ కోర్టు ప్రత్యేక జడ్జి జస్టిస్ బివిఎల్‌ఎన్ చక్రవర్తి తీర్పునిచ్చారు. ఈ కేసులో ఏ2గా ఉన్న మాజీ అసిస్టెంట్ మేనేజర్ ఉదయ్‌శంకర్ మూడేళ్ల జైలు, రూ. 10వేల జరిమానా, 420 కింద ఐదేళ్ల జైలు, రూ. 25వేల జరిమానా, యు/ఎస్ 468 కింద మరో ఏడాది జైలుశిక్షతోపాటు రూ. 10వేలు జరిమానా, యు/ఎస్ 471 కింద మరో ఏడాది జైలు, పది వేల జరిమానా, యు/ఎస్ 13/ఆర్/డబ్ల్యు 13(1) కింద ఐదేళ్ల జైలుతోపాటు రూ. లక్ష రూపాయలు జరిమానా విధించారు. ఏ3గా ఉన్న బి రమణజీ రావుకు యు/ఎస్ 120బి కింద మూడేళ్ల జైలు, పది వేల జరిమానా, యు/ఎస్ 420కింద ఐదేళ్ల జైలు రూ. 25వేల జరిమానా, యు/ఎస్ 468 కింద ఏడాది జైలుతోపాటు రూ. 10వేలు జరిమానా అదేవిధంగా యు/ఎస్ 419 కింద ఏడాది జైలు, రూ. 10వేలు, యు/ఎస్ 467కింద మరో ఏడాది జైలుశిక్షతోపాటు రూ. 10వేలు జరిమానా విధించారు. ఏ4గా ఉన్న సీతారామారావు యు/ఎస్ 120-బి కింద మూడేళ్ల జైలుశిక్షతోపాటు పదివేల జరిమానా, యు/ఎస్ 420కింద ఐదేళ్ల జైలు, రూ. 25వేల జరిమానా, యు/ఎస్ 468కింద ఏడాది జైలు రూ. 10వేలు జరిమానా విధించారు. యు/ఎస్ 419కింద మరో ఏడాది జైలు రూ. 10వేలు, యు/ఎస్ 467కింద ఏడాది జైలుశిక్షతోపాటు రూ. 10వేలు జరిమానా విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. అదేవిధంగా ఏ5గా ఉన్న ఏవి సుబ్బారావుకు యు/ఎస్ 120-బి కింద మూడేళ్ల జైలుశిక్ష రూ. 10వేల జరిమానా, యు/ఎస్ 420 కింద ఐదేళ్ల జైలుతోపాటు రూ. 25వేల జరిమానా విధిస్తూ సీబీఐ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. అయితే ఈ శిక్షలు ఏకకాలంలో ఉంటాయి.