తెలంగాణ

టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్టు దరఖాస్తు గడువు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 30: టీచర్ల రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునే గడువును పబ్లిక్ సర్వీసు కమిషన్ డిసెంబర్ 15 వరకూ పొడిగించింది. 31 జిల్లాలకు అనుగుణంగా కాకుండా పాత జిల్లాల ప్రాతిపదికగానే పోస్టుల భర్తీ జరగాలని హైకోర్టు ఆదేశించిన మేరకు కొత్త నోటిఫికేషన్‌ను సర్వీసు కమిషన్ విడుదలచేస్తోంది. దీని ప్రకారం స్కూల్ అసిస్టెంట్లు 2068, పిఇటి, లాంగ్వేజి పండిట్లు కలిపి 969, ఎస్‌జిటి పోస్టులు 9269 భర్తీ చేస్తారు. అలాగే జిల్లాల వారీ తీసుకుంటే ఆదిలాబాద్‌లో 1322, హైదరాబాద్‌లో 681, ఖమ్మం జిల్లాలో 1420, కరీంనగర్ జిల్లాలో 1409, మహబబూబ్‌నగర్ జిల్లాలో 1555, మెదక్ జిల్లాలో 1160, నల్గోండ జిల్లాలో 1450, నిజామాబాద్ జిల్లాలో 1344, రంగారెడ్డి జిల్లాలో 999, వరంగల్ జిల్లాలో 966 పోస్టులను భర్తీ చేస్తారు.