తెలంగాణ

సర్కారుపై ఇక యుద్ధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 30: డిసెంబర్ 4న తలపెట్టిన కొలువులపై కొట్లాట సభ టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పెద్ద యుద ధమేనని టీజేఏసీ చైర్మన్ కోదండరాం వెల్లడించారు. కొలువులపై కొట్లాట సభ నిర్వహణలో భాగంగా గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సన్నాహక ర్యాలీని నిర్వహించారు. విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకూ నిరుద్యోగ సమస్య జఠిలం అవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిరుద్యోగులపై దృష్టిపెట్టడం లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ రాకముందు ఉద్యోగాల కోసం ఎదురుచూసిన యువత తెలంగాణ వచ్చాక కూడా మూడున్నర ఏళ్లుగా కొలువుల కోసం ఎదురుచూస్తూనే తమ జీవితాలు కోచింగ్ సెంటర్లకే పరిమితం అయ్యేలా ఉన్నాయనే ఆవేదనతో మగ్గుతున్నారని అన్నారు. ప్రభుత్వానికంటూ నియామకాలపై ఓ స్పష్టత లేదని, 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భరీకి కేసీఆర్ సీఎం అయ్యాక కేవలం 18 వేలలోపు మాత్రమే ఉద్యోగాలు భర్తీ చేశారని, అందులో 11 వేలకుపైగా పోలీసు శాఖలో భర్తీ చేయించుకున్నారన్నారు. మిగతా వాటిపై దృష్టి సారించడం లేదన్నారు. ఖాళీల భర్తీపై తాము పదేపదే ప్రభుత్వానికి సూచనలు ఇస్తుంటే వాటిని ఏమా త్రం పరిగణనలోకి తీసుకోవడం అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఓ బహిరంగసభ ద్వారా ప్రభుత్వానికి సూచనలు చేద్దామని అనుకుంటే సభకు అనుమతిని నిరాకరించిందన్నారు. పదినెలల తర్వాత ప్రభుత్వంపై కోర్టులో పోరాటం చేయడంతో కోర్టు సభకు అనుమతి ఇవ్వడంతో డిసెంబర్ 4న కొలువులపై కొట్లాటసభ సరూర్‌నగర్ స్టేడియం మైదానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 31 జిల్లాల విద్యార్థులు, నిరుద్యోగులు ఈ సభను విజయవం తం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్లు తెరిపించాలని పిలుపునిచ్చారు. ఓట్లు వేసిన ప్రజలను ముఖ్యమంత్రి మరచిపోయారని ఏదైతే తెలంగాణ సంపాదను ఆంధ్రా కాంట్రాక్టర్లు దోచుకువెళ్తున్నారని వ్యాఖ్యా నించారు. ఉద్యమ సమయంలో ప్రజలు భావించారో అదేతరహాలో తెలంగాణ వచ్చాక కూడా ఆంధ్రా కాంట్రాక్టర్ల చేతిలో తెలంగాణను పెట్టారని కోదండరాం ధ్వజమెత్తారు. ఉద్యోగాల భర్తీపై వాస్తవాలు వెలుగులోకి వస్తే టీఆర్‌ఎస్ రాజకీయం ప్రశ్నార్థకంగా మారుతుందనే దురుద్దేశ్యంతోనే గత కొన్నినెలలుగా తాము చేపట్టబోయే కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని ఆరోపించారు. మిషన్ భగీరథ పేరిట తెలంగాణలోని నిధులన్నింటినీ అక్కడికి మళ్లించి దోపిడీ చేస్తున్నారని రూ.16 వేలకోట్లతో పూర్తి కావల్సిన పనులను రూ.40 వేల కోట్ల వరకు పెంచుకుని ప్రజాధనాన్ని తమ జేబుల్లోకి నింపుకుంటున్నారని విమర్శించారు. టీజేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి, కో-కన్వీనర్ చంద్రానాయక్, ప్రభాకర్, బాలకిషన్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.