తెలంగాణ

కోటి ఎకరాలకు సాగునీరే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేతేపల్లి, నవంబర్ 30: రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కోటి ఎకరాలకు సాగునీరు అందించడం కోసం ప్రభుత్వం కృషిచేస్తుందని రాష్ట్ర విద్యుత్, దళిత సంక్షేమ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లాలో రెండవ అతిపెద్ద సాగునీటి ప్రాజె క్టు మూసీలో గురువారం కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, శాసనసభ్యుడు వేముల వీరేశంతో కలిసి 19 లక్షల చేపపిల్లలను ప్రాజెక్టులో వదిలారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని గ్రామాల స్వయం సమృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు.
గ్రామంలోని ప్రతి పౌరుడికి ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలను ప్రవేశపెడుతుందన్నారు. అన్ని గ్రామాల్లో వౌలిక వసతులు కల్పించేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 209 చెరువుల్లో 209 లక్షల చేపపిల్లలను వదిలినట్లు తెలిపారు. మూసీ ప్రాజెక్టు కాలువల ఆధునీకరణకు ప్రభుత్వం రూ. 65 కోట్లు మంజూరు చేసిందన్నారు. ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల సంక్షేమం దృష్టా ప్రాజెక్టు కాలువల ఆధునీకరణ కోసం కేటాయించేందుకు కృషిచేసిన మంత్రిని మండల రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఘనం గా సన్మానించారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ ప్రాజెక్టు వద్ద రూ.19 కోట్లతో నిర్మిస్తున్న బీసీ గురుకుల పాఠశాల, కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈకార్యక్రమంలో శాసనసభ్యులు వేము ల వీరేశం, ఆర్డీవో వెంకటాచారి, డీపీఆర్‌వో నాగార్జున, టీఆర్‌ఎస్ నాయకులు బడుగుల లింగయ్యయాదవ్, ఎంపీపీ గుత్తా మంజులా మాధవరెడ్డి, సర్పంచ్‌లు కాల్సాని లింగయ్య, బొజ్జ సైదమ్మ, ఎంపీటీసీలు కందు ల మోహన్, టీఆర్‌ఎస్ నాయకులు బొజ్జ సుందర్, చిమట వెంకన్నయాదవ్, మహేందర్‌రెడ్డి, సాదుల నర్సయ్య, అల్వాల వెంటకస్వామి, మాధవరెడ్డి, కత్తుల వీరు, ఇందిర తదితరులు పాల్గొన్నారు.