తెలంగాణ

క్యాష్-ఈ యాప్ ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 30: ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సు అనేక మందికి గొప్ప అవకాశాలను సృష్టించింది. ఏరిస్ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ సంస్థ ప్రతినిధి వి రమణ కుమార్ కేష్-ఇ యాప్‌ను ఆవిష్కరించారు. అత్యంత భద్రతంగా, పారదర్శక పద్ధతిలో నగదు బదిలీకి ఈ యాప్ ఉపయోగపడుతుందని రమణకుమార్ పేరొచ్కన్నారు. తెలంగాణకు చెందిన రమణ కుమార్ ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో ఈ యాప్ ఆవిష్కరించడం ఆనందంగా ఉందని అన్నారు. సదస్సులో సినీ నటి అదితిరావు అదరగొట్టారు. హైదరాబాద్‌లో పచ్చదనం, పరిశుభ్రత తనను ఎపుడూ మంత్రముగ్ధురాలిని చేస్తుందని అదితిరావు పేర్కొన్నారు. ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో ఆమె ఒక ప్యానల్ చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని ఆమె వివరించారు. ఈ చర్చలో చలనచిత్ర నిర్మాత రానీ స్క్రీవాల , నైజీరియన్ నటుడు స్టీఫెన్ లినస్ లు పాల్గొన్నారు. సినిమాల భవిష్యత్ ఎలా ఉండబోతోందనే చర్చ ఈ సందర్భంగా జరిగింది. తాను ఎలాంటి చిత్రాలను నిర్మించడం లేదని, కనుక ఈ చర్చ సందర్భంగా ఎంతో ఆసక్తికరమైన అంశాలు తనకు తెలిశాయని ఆమె వ్యాఖ్యానించారు.
మహిళల సాధికారత కు ప్రత్యేక శిక్షణ
మహిళల సాధికారత సాధించేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు టిఐఇ గ్లోబల్ సంస్థ ప్రకటించింది. ఆర్ధికంగా మహిళలు సత్తాను సంతరించుకున్న రోజున తప్పకుండా వారు సాధికారత సాధించగలుగుతారని పేర్కొన్నారు. సంస్థ చైర్‌పర్సన్ సీమా చతుర్వేది మాట్లాడుతూ 27 నగరాల్లో 125 మంది శిక్షకులు మహిళలకు మార్గదర్శకంగా నిలుస్తారని చెప్పారు.

చిత్రం..క్యాష్-ఈ యాప్‌ను ఆవిష్కరించిన అనంతరం చర్చాగోష్ఠిలో రమణకుమార్