తెలంగాణ

చిన్నతనంలోనే ఔత్సాహికత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 30: పారిశ్రామిక ఔత్సాహికత అనేది చిన్నతనంలోనే మొదలు కావాలనిగ అమెరికా కార్మిక శాఖ, మహిళా విభాగం డైరెక్టర్ పాట్రీసియా జి గ్రీన్ పేర్కొన్నారు. ఇందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాధమిక స్థాయి నుండే ఔత్సాహికతను ప్రోత్సహించే పాఠ్యాంశాలను ప్రణాళికలో చేర్చడంతో పాటు తోడ్పాటు ఇవ్వాలని, పిల్లల ఆలోచనలను మెరుగుపరచాలని చెప్పారు. మూడు రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామిక సదస్సు ముగింపు కార్యక్రమం ప్యానల్ చర్చలో ఆమె మాట్లాడారు. అవకాశాలను గుర్తిచడం, వాటికి విలువను చేర్చడం ద్వారానే ఔత్సాహికత సాధ్యమవుతుందని ఆమె చెప్పారు. పెట్టుబడి అనేది చిట్టచివరి అంశమని, ముందుగా తన ఆలోచనలను పదునుపెట్టి దానిని ఒక రూపంలోకి తీసుకువచ్చి వాస్తవం చేసే దిశగా పయనించాలని ఆమె అన్నారు. ఎవరూ ప్రభుత్వం నుండి ఉచితంగా డబ్బు అందుతుందని భావించరాదని, వాళ్ల ఆలోచనలు, శక్తి యుక్తులే పెట్టుబడిగా భావించాలని అన్నారు. మైత్రా ఎనర్జీ చైర్మన్ రవి కైలాష్ మాట్లాడుతూ విభిన్నమైన పారిశ్రామిక ఔత్సాహికతకు అవకాశాలున్నాయని, వాటిని గుర్తెరగాలని చెప్పారు. బైన్ క్యాపిటల్ హెడ్ అమిత్ రణ్‌బీర్ చంద్ర మాట్లాడుతూ కనీస పెట్టుబడి మాత్రం చేతులో ఉన్నపుడు అడుగు ముందుకు వేయగలుగుతామని అన్నారు.