తెలంగాణ

నోబెల్ సాధించాలని ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 30: పదిహేనేళ్ల బాలిక తనకు నోబెల్ బహుమతి గ్రహీత కావాలని ఉంది అంటే అందరూ ముక్కున వేలేసుకుని ఆశ్చర్యంగా చూశారు. హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో అజర్‌బైజన్ నుండి వచ్చిన బాలిక రేయన్ తన ఆలోచనలతోనే కాదు, వాస్తవికంగా తాను కృషి చేసి సత్తా ప్రదర్ళించింది. జీఈఎస్‌లో పాల్గొంటున్న అతి పిన్నవయస్కురాలైన బాలిక ఆమె. గాలి నుండి విద్యుత్ తయారుచేస్తున్నాం, నీటి నుండి విద్యుత్ తయారుచేస్తున్నాం, అణువుల నుండి విద్యుత్ తయారుచేస్తున్నాం, చివరికి సూర్యుడి వేడి నుండి విద్యుత్ తయారుచేస్తున్నాం, ఇవన్నీ చూశాక వర్షం నుండి విద్యుత్ ఎందుకు తయారుచేయకూడదు అనే ఆలోచన వచ్చింది అని రేయన్ చెబుతోంది.
ప్రారంభ కార్యక్రమంలో ఇవాంక ట్రంప్ ప్రస్తావించిన మూడు పేర్లలో రేయాన్ కూడా ఉంది. ఇవాంక తన పేరు ప్రస్తావించడం చాలా ఆనందంగా ఉందని రేయన్ ఆంధ్రభూమి ప్రతినిధితో చెప్పింది. ఎంతో సాధించాలని ఉంది, భౌతిక శాస్త్రంలో నిపుణురాలై , నోబెల్ బహుమతి సాధించాలని ఉంది అని రేయన్ పేర్కొంది. తన ఆలోచన వచ్చిందే తడవుగా వర్షం నుండి విద్యుత్‌ను తయారు చేసే ప్రయత్నం మొదలైందని పేర్కొంది. చాలా మందికి ఈ ఆలోచన తొలుత ఆశ్చర్యపరిచినా, తర్వాత ఇది అమలులోకి తెచ్చానని పేర్కొంది. రెయినర్జీ పేరుతో సంస్థను ప్రారంభించిన రేయాన్ తనకు తొలుత 20వేల డాలర్ల పెట్టుబడి లభిస్తే తన ఉత్పత్తికి రూపాన్ని ఇస్తానని అంటోంది. రేయాన్ మాటలు విన్న చాలా మంది పారిశ్రామికవేత్తలు నముందుకు వచ్చారు, ఇదేమీ పెద్దపెట్టుబడి కాదని వారంతా ముందుకు రావడం తనకు ఆశ్చర్యపరిచిందని రేయన్ పేర్కొంది. 22 వాట్లతో 22 ఎల్‌ఇడి బల్బులను వెలిగించవచ్చని రేయాన్ చెబుతోంది. అలాగే పీజో ఎలక్ట్రిక్ జనరేటర్‌ను తయారుచేసుకోవచ్చని,తాను తయారుచేసే ఉత్పత్తుల వల్ల వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్‌ను బాగా నిరోధించవచ్చని చెప్పింది.

చిత్రం..రేయన్