తెలంగాణ

కేసుల ఉపసంహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, డిసెంబర్ 1: గొల్లపల్లి తహశీల్దార్ సుమ, విఆర్‌ఓ శ్రీలతలపై ఆక్రమంగా నమోదు చేసిన కేసులను ఉపసంహరించుంటామని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్‌కు జిల్లా కలెక్టర్ సమీక్షంలో ఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. అంతేకాకుండా కేసు నమోదు చేసిన గొల్లపల్లి ఎస్సై చారిని వేకెన్సీ రిజర్వుడ్‌లో పెడుతూ ఉత్తర్వులు జారీ చేయడంతో రెవెన్యూ ఉద్యోగులు అధికారులతో పాటు ఇతర శాఖల ఉద్యోగులు, అధికారులపై ఎలాంటి అక్రమ కేసులు నమోదు చేయమని ఎస్పీ హామీ ఇవ్వడంతో సమ్మె విరమించినట్లు రెవెన్యూ ఉద్యోగుల తెలిపారు.
అంతకుముందు రెవెన్యూ ఉద్యోగుల అభ్యున్నతి, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం నిరంతరం కృషి చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మఠం శివశంకర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఐఎంఎ భవనంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి తహశీల్దార్ విఆర్‌ఓపై పోలీసులు నమోదు చేసిన ఆక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమావేశంలో శివశంకర్‌ప్రసంగించారు. అంతకుముందు పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన ఉద్యోగులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసే అధికారం లేదన్నారు. సంబంధిత అధికారులపై కేసులు నమోదు చేయాలంటే జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకోవాలని అన్నారు. జిల్లాలో చేపడుతున్న భూ ప్రక్షాళన కార్యక్రమంలో అధికారుల కృషి వల్ల జిల్లాలో 99 శాతం పూర్తి చేసి రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉందని స్వయంగా సిఎం కేసిఆర్ అసెంబ్లీలో ప్రస్తావించారని ఆయన గుర్తు చేశారు. పోలీసులు రెవెన్యూ అధికారులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా జిల్లాలో భూ ప్రక్షాలన కార్యక్రమాన్ని అడ్డంకులు ఎదురవుతున్న దృష్ట్యా వెంటనే కేసులను ఎత్తివేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు శ్రీహరిరెడ్డి, ప్రభాకర్, ఎల్లారెడ్డి, హరి అశోక్‌కుమార్, ఎండి వకీల్, బోగ శశిధర్, ఉపేందర్‌రావు, కృష్ణ, సుగుణాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాజేష్, సుమ, శ్రీలత, వివిధ మండల తహశీల్దార్‌లు పాల్గొన్నారు.