తెలంగాణ

‘అడవుల్లో అగ్నిప్రమాదాలను నివారిద్దాం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: అడవుల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా నివారించేందుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అటవీ శాఖ ఉన్నతాధికారులు జిల్లాల్లోని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. అటవీ సంరక్షణ అధికారి (వైల్డ్ లైఫ్) డాక్టర్ మనోరంజన్ భాంజా శుక్రవారం జిల్లా అటవీ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడారం జాతర కూడా వస్తోందని, ఈ జాతర పూర్తిగా అటవీ ప్రాంతంలో జరుగుతున్నందున అటవీ సంపదకు, భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. వచ్చే ఏడాది ఒక్క అగ్ని ప్రమాదం కూడా జరగకుండా చూడాలని, అగ్ని ప్రమాదం లేని అటవీ సంవత్సరంగా పాటిద్ధామని ఆయన తెలిపారు. వన్య మృగాల వేట పెండింగ్ కేసులపై దృష్టి పెట్టాలని, దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. ప్రధాన అటవీ సంరక్షణ అధికారి పీకె ఝా మాట్లాడుతూ నాటిన మొక్కల్లో బతికిన శాతాన్ని ఖచ్చితంగా అంచనా వేయాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి నివేదికలు పంపాలని అన్ని జిల్లాల అటవీ అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది హరితహారం కోసం గ్రామ, మండలాల వారీగా నివేదికలు రూపొందించాలని, అందుకు అవసరమైన విధంగా నర్సరీలకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.