తెలంగాణ

ఎన్‌డీ దళనేత గోపన్న అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, డిసెంబర్ 1: మహబూబాబాద్ జిల్లా సీపీఐ ఎంఎల్(ఎన్డీ) రాయల వర్గం జిల్లా కార్యదర్శి దనసరి సమ్మయ్య అలియాస్ గోపన్నను అరెస్ట్‌చేసినట్టు జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి తెలిపారు. గత నెల 30న మహబూబాబాద్ పట్టణంలోని రాహుల్‌నగర్‌లో తన భార్య ఉంటున్న ఇంటికి వచ్చిన గోపన్న కాంట్రాక్టర్‌ల నుండి డబ్బులు వసూలు చేయడానికి వారిని అక్కడకు పిలుస్తున్నాడన్న పక్కా సమాచారం అందుకున్న పోలీసులు గోపన్న ఇంటిని చుట్టుముట్టారు. పోలీసుల రాకను పసిగట్టిన గోపన్న ఇంటి నుండి తప్పించుకొని పారిపోవడంతో పోలీసులు మరింత అప్రమత్తమై అదనపు బలగాలతో గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణంలోని మునే్నరువాగు దక్షిత దిశలో ఇటుక బట్ట్టీల వద్దకు వెళ్లి అక్కడ పొదల్లో గోపన్న దాక్కొని ఉండగా పోలీసులకు పట్టుపడ్డాడు. గోపన్న వద్ద నుండి ఒక 8ఎంఎం రైఫిల్, మ్యాగ్జిన్స్, 10రౌండ్‌ల బుల్లెట్లు, పౌచ్‌తోపాటు, కిట్‌బ్యాగు, పార్టీ సాహిత్యం, టెటర్‌ప్యాడ్‌లు, జెండాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. గోపన్న దళం గతంలో అనేక మంది కాంట్రాక్టర్‌ల నుండి బలవంతపు వసూళ్లు చేయడంతోపాటు ఇతర అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డట్లు ఎస్పీ వివరించారు. 2004లో ఎన్నలగడెం దగ్గర పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో పాల్గొన్నారు. 2010లో కొత్తగ బెల్టుషాపులు ధ్వంసం చేసి వారిపై దాడిచేసిన కేసులో ప్రధాన నిందితుడు. ఖానాపురం మండలంలోని మంగళవారిపేటలో బలవంతపు వసూళ్లు చేసిన సంఘటన, 2012లోబొద్దుగొంమడ తండావాసులు గుగులోతు దస్రు, గుగులోతు రాజుల హత్యకేసులో ప్రధాన ముద్దాయి.