తెలంగాణ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుకు రాష్టస్థ్రాయి కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: దేశవ్యాప్తంగా నీతి అయోగ్ ఎంపిక చేసిన 115 వెనుకబడిన జిల్లాల్లో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్టస్థ్రాయి కమిటీని నియమిస్తూ ప్రణాళిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఎంపికైన 150 వెనుకబడిన జిల్లాల్లో రాష్ట్రం నుంచి జయశంకర్ భూపాల్‌పల్లి, కొమురం భీమ్ ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. రాష్టస్థ్రాయి కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్స్‌న్‌గా మెంబర్ కన్వీనర్‌గా పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక ఆహ్వానితునిగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, సభ్యులుగా ప్రణాళికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ముగ్గురు జిల్లా నోడల్ అధికారులు వ్యవహరిస్తారని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
ఈ మూడు జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం తరఫున ముగ్గురు ఐఏఎస్ అధికారులను నోడల్ అధికారులను నియమించినట్టు ప్రణాళికశాఖ పేర్కొంది. ఖమ్మం జిల్లా నోడల్ అధికారిగా రాజీవ్ రంజన్ మిశ్రా, ఆసిఫాబాద్ జిల్లా నోడల్ అధికారిగా వసుధామిశ్రా, భూపాల్‌పల్లి జిల్లా నోడల్ అధికారిగా సంజయ్‌కుమార్‌ను నియమించినట్టు ప్రణాళికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బిపి ఆచార్య పేర్కొన్నారు.