తెలంగాణ

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వేతనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వేతనాలు చెల్లించనున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ డిసెంబర్ నుంచి అమలుల్లోకి వచ్చింది. అర్చకులకు, ఆలయ ఉద్యోగులకు పే స్కేళ్లను ఖరారు చేస్తూ చెల్లించే వేతనాలకు సంబంధించిన చెక్క్‌ను దేవాలయశాఖ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులకు అందజేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో అర్చకులు, ఆలయ ఉద్యోగులకు డిసెంబర్ ఒకటి చారిత్రాత్మకమైన రోజు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ అర్చకులు, ఆలయ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అర్చకులు, ఆలయ ఉద్యోగులకు పే స్కేళ్లను అమలు చేయడం వల్ల ఏటా రూ.115 కోట్ల వ్యయం అవుతుందని అంచన వేసామన్నారు. ఇప్పటికే రూ.37.50 కోట్లు విడుదల చేసామన్నారు. దేవాలయాల ద్వారా వస్తున్న ఆదాయ వనరులను పరిగణనలోకి తీసుకొని అవసరమైన మేరకు నిధులు కేటాయిస్తామన్నారు. అర్చకులు, ఆలయాల ఉద్యోగుల వేతనాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు తుమ్మల నాగేశ్వర్‌రావు, నాయిని నరసింహరెడ్డి తలసాని శ్రీనివాస్‌యాదవ్, జూపల్లి కృష్ణారావుకు అర్చకులు, ఆలయ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు ముఖ్యమంత్రి కెసిఆర్ పరిష్కారం చూపారని ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి అన్నారు. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి ఎంత ముఖ్యమైందో, అర్చకులు, ఆలయ ఉద్యోగులకు డిసెంబర్ అంతే ముఖ్యమైందని అన్నారు. ఈ సమావేశంలో దేవాదాయశాఖ కార్యదర్శి ఎన్ శివశంకర్, దేవాదాయశాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావు, ఆర్జేసి కృష్ణవేణితో పాటు అర్చక సమాఖ్య ప్రతినిధులు గంగు భానుమూర్తి, గంగు ఉపేంద్రశర్మ పాల్గొన్నారు.

చిత్రం..మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని సన్మానిస్తున్న అర్చకులు, ఆలయ ఉద్యోగులు